CM Chandrababu Serious: తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్న మధ్య విభేదాలపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.. వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీకి అప్పగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.. కొలికపూడి శ్రీనివాసరావు, కేశినేని చిన్ని ఇద్దరినీ పిలిచి మాట్లాడాలని సూచించారు.. ఇరు వర్గాల నుంచి వివరణ తీసుకుని తనకు నివేదించాలని స్పష్టం చేశారు చంద్రబాబు.. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక తాను కూడా ఇద్దరితో మాట్లాడతానన్నారు.. పార్టీ క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించిదే లేదని తేల్చి చెప్పారు.. విభేదాలు కొలిక్కిరాకుంటే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.. కొంతమంది ఎమ్మెల్యేలు సీఎంఆర్ఎఫ్ సిపార్సు లేఖలు ఇవ్వట్లేదని కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.. నామినేటెడ్ పదవుల కోసం లిస్ట్ ఇవ్వని ఎమ్మెల్యేల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు.. కమిటీలు వేయడానికి లిస్ట్ లు ఎమ్మెల్యేలు పంపకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.. ఇకపై వారంలో ఒకరోజు పార్టీ కార్యాలయానికే కేటాయిస్తానని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు..
Read Also: CM Chandrababu Couple London Tour: రేపు లండన్‌కు చంద్రబాబు దంపతులు..