టాలీవుడ్ నటుడు రణధీర్‌రెడ్డిని గన్‌తో బెదిరించారు భూ కబ్జాదారులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా పూడూరులో తుపాకీ కలకలం రేపింది. నటుడు రణధీర్‌రెడ్డిని తుపాకీతో భూ కజ్జాదారులు బెదిరించారు. హిమాంపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 13 నుంచి 19 వరకు ఇరవై ఎనిమిది ఎకరాలు భూమి కొనుగోలు చేశారు రణధీర్‌రెడ్డి. అయితే, భూమి చదును పనులు చేయిస్తుండగా, హైదరాబాద్‌కు చెందిన సుల్తాన్ హైమత్ ఖాన్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు.. గన్‌లోడ్ చేసి చంపుతానంటూ రణధీర్‌రెడ్డిని […]
ఆంధ్రప్రదేశ్‌లో 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్… హై స్కూల్ ప్లస్ పాఠశాలలను.. బాలికలకు ప్రత్యేకంగా కేటాయిస్తూ ఆదేశాలిచ్చారు. హై స్కూల్ ప్లస్ పాఠశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీలలో రెండు కోర్సులు మాత్రమే అందించనున్నట్టు స్పష్టం చేసింది. స్థానికంగా ఉన్న డిమాండ్‌ను అనుసరించి కోర్సులు నిర్దారించాలని నిర్ణయించింది ప్రభుత్వం… పీజీటీ సమాన స్థాయి అధ్యాపకులనే బోధనకు తీసుకోనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 1,752 స్కూల్ అసిస్టెంట్లను 292 జూనియర్ కళాశాలల్లో […]
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు షాక్ ఇస్తుంది.. నో యువర్-కస్టమర్ (KYC) నిబంధనలను పాటించనందున, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అనేక మంది ఖాతాదారుల ఖాతాలను స్తంభింపజేసింది. ఎస్బీఐ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేస్తూ.. బ్యాంక్ కస్టమర్లు దీనికి సంబంధించిన ఫిర్యాదులను ట్వీట్ చేస్తున్నారు.. ఇంతకీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయాన్ని పరిశీలిస్తే.. కేవైసీ నిబంధనల్ని పాటించని కారణంగా ఎస్బీఐ తన ఖాతాదారుల అకౌంట్లను […]
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు సర్వం సిద్ధం అవుతోంది.. ఈనెల 8,9 తేదీల్లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఈ ప్లీనరీ నిర్వహించనుండగా.. పార్టీ ఆవిర్బావం తరువాత ఇది మూడో ప్లీనరీ.. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ప్లీనరీ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.. ఈ సమావేశాలు అయినా ఫుడ్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది.. సీఎం వైఎస్ జగన్ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, […]
తన అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. పార్టీలో ఉండే నాయకులపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టొద్దని సూచించిన ఆయన.. నా అభిమానులు ఎవరు అలా చేసినా పార్టీలో ఉండరు అని హెచ్చరించారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లీనరీ వేదికగా పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు.. 2024 టార్గెట్‌గానే ఈ ప్లీనరీ ఉంటుందని తెలిపారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు తెలుగుదేశం పార్టీ నేత, మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి.. పెద్దిరెడ్డి ఏమీ పెద్ద లీడర్ కాదన్న ఆయన.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బొమ్మ లేకుండా సొంతం బొమ్మతో పోటీ చేయగలరా..? పోటీ చేసి గెలిచే దమ్ము ఉందా…? అంటూ ఓపెన్ చాలెంజ్ విసిరారు.. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు […]
ఒక క్లాస్ కు ఒక టీచర్ కాకుండా కేంద్ర సిలబస్ ప్రకారం సబ్జెక్ట్‌కు ఒక టీచర్ విధానం తీసుకుని వస్తున్నాం.. రాష్ట్రంలో ఒక్క స్కూల్ కూడా మూసివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ