* ఇండోర్‌లో నేడు భారత్-సౌతాఫ్రికా చివరి టీ-20, రాత్రి 7 గంటలకు భారత్-సౌతాఫ్రికా మ్యాచ్, మూడో టీ20లో కోహ్లీ, కేఎల్ రాహుల్ విశ్రాంతి
* తిరుమలలో 8వ రోజు వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేడు ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీవారు
* నేటి నుంచి విశాఖ-పుణె మధ్య నాన్‌స్టాప్ విమాన సర్వీసులు, వారంలో మూడు రోజులు నడిపే విధంగా ఇండిగో షెడ్యూల్ ప్రకటన
* హైదరాబాద్: నేడు గాంధీభవన్‌లో మునుగోడు ఉప ఎన్నికపై సమీక్ష, పాల్గొననున్న మాణిక్యం ఠాగూర్, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి
* హైదరాబాద్: సాయంత్రం 4.30కి బోయిన్‌పల్లిలో రాహుల్ భారత్ జోడో యాత్రపై సమావేశం
* కర్ణాటక: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు రెండు రోజులు విరామం.. దసరా ఉత్సవాల సందర్భంగా కొడగులో రాహుల్ గాంధీ రెండు రోజుల విశ్రాంతి.. అక్టోబర్ 6న తిరిగి రాహుల్ యాత్ర పునఃప్రారంభం
* ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, ఏపీలోని రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు
* తిరుమల: రేపటితో ముగియనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. రేపు ఉదయం చక్రస్నానం.. రాత్రి ధ్వజాఅవరోహణంతో ముగియనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు
* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి దేవిచౌక్ లో మహిషాసురావర్ధని అలంకరణతో భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మ వారు, 89వ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు పోటెత్తిన భక్తులు
* నెల్లూరు జిల్లా: పొడలకూరు మండలం ప్రభగిరిపట్నంలోని వ్యవసాయ ఉత్పత్తుల తయారీ కేంద్రం కిసాన్ క్రాఫ్ట్ ను సందర్శించనున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
* విశాఖ: శ్రీ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు, నేడు మహిషాసురమర్ధిని అవతారంలో రాజశ్యామల అమ్మవారు
* విశాఖ: నేటితో 600 రోజులకు చేరుకున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు…
* విజయనగరం: నేడు శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకోనున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో అమ్మవారి జాతరపై అధికారులతో సమీక్ష సమావేశం… కలెక్టర్ కార్యాలయంలో పైడితలమ్మ ఉత్సవాలపై సమీక్షలో పాల్గోనున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.
* తిరుమల: నేడు తిరుమలకు సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు, రేపు చక్రస్నానం కార్యక్రమంలో పాల్గొననున్న ఎన్వీ రమణ దంపతులు
* విజయవాడ: ఇంద్రకీలాద్రిపై తుది దశకు చేరుకున్న దసరా ఉత్సవాలు, నేడు శ్రీ మహిషాసుర మర్దినీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ.. రేపటితో దసరా వేడుకలు ముగియనున్నందున ఇంద్రకీలాద్రికి పెరిగిన భక్తులు, భవానీల తాకిడి
* నేడు శ్రీశైలం రానున్న మంత్రి కొట్టు సత్యనారాయణ, దసరా మహోత్సవాలు సందర్భంగా శ్రీ స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి కొట్టు
* నేడు శ్రీశైలంలో తొమ్మిదోవరోజు దసరా మహోత్సవాలు, సాయంత్రం సిద్ధిదాయిని అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం, అశ్వవాహనంపై పూజలందుకోనున్న స్వామి అమ్మవార్లు, రాత్రి కన్నులపండువగా ఆదిదంపతులు గ్రామోత్సవం