ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ ములాయం కుమారుడు, మాజీ సీఎం, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు ఫోన్ చేసిన కేసీఆర్.. ములాయం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ములాయం యోగ క్షేమాలపై ఆరా తీశారు.. తాను దసరా తర్వాత స్వయంగా వచ్చి కలుస్తానని ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ కు తెలిపారు కేసీఆర్. కాగా, ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో చికిత్స కోసం చేర్పించారు కుటుంబసభ్యులు… కానీ, ఆదివారం నాడు ములాయం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Read Also: Shashi Tharoor: ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్.. మేమంతా ఒక్కటే, సిద్ధాంత వైరుధ్యాలు లేవు..