‘మై విలేజ్ షో’ ఛానల్ ద్వారా ఓ పల్లెటూరు నుంచి యూట్యూబ్‌లో వీడియోలు ప్రారంభించిన గంగవ్వ… 60 ఏళ్లు దాటినా తన స్టైల్ లో యాక్టింగ్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంది.. ఏకంగా బిగ్ బాస్‌లో పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది.. ఇప్పుడు గంగవ్వకు మాట ఇచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. కరీంనగర్ కళోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి.. అంబేద్కర్ స్టేడియం వేదికగా మూడురోజులుగా అట్టహాసంగా సాగిన కళోత్సవాలు.. చివరి రోజు మహాత్మా జ్యోతిబాపూలే మైదానం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర అంబేద్కర్ స్టేడియం దాకా కనుల పండువగా, నగర ప్రజల్లో ఫుల్ జోష్ నింపింది. ఉత్సవాల ఆఖరు రోజైన ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.. మంత్రుల గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్ రావు, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ విజయ తదితరులు పాల్గొన్నారు.. నటుడు శివారెడ్డి, సింగర్లు వొల్లాల వాణి, మధుప్రియ, స్వర్ణ, వందేమాతరం శ్రీనివాస్, వడ్లకొండ అనిల్, వంతడుపుల నాగరాజు, గంగవ్వ, జీల అనిల్, కొమురక్క, బిగ్‌బాస్ ఫేం సోహెల్ కూడా హాజరై జోష్ నింపారు..
Read Also: Rat Stolen: ఎలుక ఎత్తుకెళ్లారని ఫిర్యాదు.. ముగ్గురిపై కేసు నమోదు
ఈ సందర్భంగా గంగవ్వ మాట్లాడుతూ.. ‘కేటీఆర్ మహేష్ బాబు లెక్క ఉన్నడు’ అంటూ ఆశానికి ఎత్తేసింది.. ఇక కేటీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్ కళోత్సవాల్లో గొప్ప గొప్ప కళాకారులను నేరుగా కలిసే అవకాశం దొరికిందన్నారు.. కళోత్సవాల ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన ఆయన కళాకారు ప్రదర్శనలను స్వయంగాచూసి ప్రత్యేక అనుభూతికి లోనయ్యారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన గంగవ్వ ప్రతిభా పాటవాలతో మంచి గుర్తింపు తెచ్చుకుందన్నారు. గంగవ్వ నిర్వహిస్తున్న విలేజ్ మైషోద్వారా నాలుగు విషయాలు తెలుసుకుని, తనకు తోచిన నాలుగు మాటలను విలేజ్ మైషోద్వారా చెబుతున్నారంటూ ప్రశంసలు కురిపించారు.. వేదికపై గంగవ్వను ప్రత్యేకంగా దగ్గరకు తీసుకుని నవ్వుతూ మాట్లాడారు కేటీఆర్.. నన్ను మహేష్ బాబు లాగా ఉన్నారని అన్నారు.. కానీ, నాకేం ప్రాబ్లమ్ లేదు.. ఆ మాట వింటే మహేష్ బాబు ఫీల్ అవుతారని నవ్వుతూ వ్యాఖ్యానించారు.. నువ్వు కళ్లు చూపించుకోవాలంటూ నవ్వులు పూయించారు.. గంగమ్మకు మాట ఇచ్చా మై విలేజ్ షోకు వస్తానని చెప్పా.. నాకు తెలిసిన నాలుగు విషయాలు చెబుతా.. నాకు తెలియని విషయాలు నేర్చుకుంటానని వ్యాఖ్యానించారు. ఇక అంతే కాదు, నిన్న కరీంనగర్ కళోత్సవాల ముగింపు వేడుకల్లో మై విలేజ్ షో గంగవ్వను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న రామన్న అంటూ తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ ట్విట్టర్‌లో ఓ ఫొటో షేర్ చేయగా.. ఆ ఫొటోను రిట్వీట్ చేసిన కేటీఆర్.. పాపులర్ & పక్కా లోకల్ యూ ట్యూబ్ స్టార్ గంగవ్వ గారిని కలవడం ఆనందంగా ఉంది… ఆమె మై విలేజ్ షోకి నేను అతిథిగా వస్తానని ఆమెకు ప్రామిస్ చేశానని మరోసారి గుర్తుచేసుకున్నారు మంత్రి కేటీఆర్..
Pleasure meeting the popular & Pakka local You Tube star Gangavva Garu 😊
Promised her that I’ll be a guest on her My Village Show asap https://t.co/0Lr5aDQEiI
— KTR (@KTRTRS) October 3, 2022