ఆంధ్రప్రదేశ్లో పండుగ వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు సాగుతున్నాయి.. తొలిరోజు అత్యంత ఉత్సాహవంతమైన వాతావరణంలో.. ఫుల్ జోష్లో ఈ సమావేశాలు సాగాయి.. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ దగ్గర జరుగుతోన్న ప్లీనరీ సమావేశాలు తొలిరోజు విజయవంతం కాగా.. రేపు రెండో రోజుతో ప్లీనరీ సమావేశాలు ముగియనున్నాయి.. తొలిరోజు నాలుగు తీర్మానాలు పెట్టి ఆమోదింపజేశారు.. ఇక, పార్టీ చీఫ్, సీఎం వైఎస్ జగన్, విజయమ్మ, మంత్రుల ఉపన్యాసాలు ఆకట్టుకోగా.. రెండోరోజు నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ను […]
బిడ్డా ఈ రాష్ట్రం వైసీపీ, జగనన్న అడ్డా.. ఎవ్వరి ఆటలు సాగవు అని హెచ్చరించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. గుంటూరులో జరుగుతోన్న వైసీపీ ప్లీనరీలో మాట్లాడిన ఆయన.. టీడీపీ, చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం నేతలు నొటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. రోషం గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. బాబు ఆయన దత్తపుత్రుడి ఆటలు సాగవని హెచ్చరించిన ఆయన.. బిడ్డా ఈ రాష్ట్రం వైసీపీ అడ్డా.. తాము […]
ఈ సీజన్లో తొలిసారి హైదరాబాద్కు రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.. సిటీలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.. తెలంగాణలోని 14 జిల్లాల్లో శనివారం అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్లో వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. రెడ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 3 రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉందని పేర్కొంది ఐఎండీ.. ఇక, తెలంగాణకు రెడ్ అలెర్ట్తో పాటు గ్రీన్, ఆరెంజ్, ఎల్లో […]
రెండు రోజుల పాటు జరుగుతోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో ప్లీనరీ సమావేశాలు ఘనంగా జరుగుతున్నాయి.. సాయంత్రం 5 గంటల తర్వాత తొలిరోజు ప్లీనరీ సమావేశాలు ముగిశాయి.. పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్.. ప్లీనరీ వేదికపై దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి సీఎం జగన్ నివాళులర్పించారు. ప్లీనరీ సమావేశాలకు వైఎస్ విజయమ్మ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు.. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు హాజరు కావడంతో పండగలా వైఎస్సార్సీపీ ప్లీనరీ […]
హెచ్ఆర్ విభాగానికి చెందిన టాలెంట్ అక్విజేషన్ టీంకు చెందిన 30 శాతం మంది ఉద్యోగుల్నిపక్కన పెట్టింది ఆ సంస్థ.. ఇక, ట్విట్టర్ లోని 100 మంది ఉద్యోగులను తొలగించింది
మంత్రి ఆర్కే రోజా సొంత నియోజకవర్గం నగరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఓ వైపు దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతిని పురస్కరించుకుని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు బ్యానర్లు, ఫ్లెక్సీలు కడితే.. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తోన్న బాదుడే బాదుడు కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టాయి టీడీపీ శ్రేణులు.. దీంతో.. నగరి టౌన్లో ఎటు చూసినా వైసీపీ వర్సెస్ టీడీపీ […]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదం చిక్కుకున్నారు.. ఆయన హైదరాబాద్ శివారులో కోడిపందాల్లో పాల్గొనడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ నగర శివార్లలో కోడిపందాల దగ్గరకు వెళ్లిన చింతమనేని ప్రభాకర్.. పోలీసులు రాగానే చల్లగా జారుకున్నారు. అయితే, కోడిపందాల్లో తాను లేనంటూ సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు.. కానీ, దీనికి ఓ వీడియోతో కౌంటర్ ఇచ్చారు పోలీసులు.. ఘటనా స్థలంలో చింతమనేని ప్రభాకర్ ఉన్న వీడియోను విడుదల చేశారు.. […]