సూపర్ సిక్స్-సూపర్ హిట్ విజయోత్సవ సభ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.. దసరా రోజున ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర అందిస్తాం అన్నారు.. ఆటో ఉన్న ప్రతి వ్యక్తికి 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తాం అంటూ శుభవార్త చెప్పారు..
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఐక్యత ఇలాగే వర్ధిల్లుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్.. అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సామాజిక, ఆర్దిక సమానత్వం సాధించడానికి పెట్టిన పథకాలివి.. కేవలం సూపర్ సిక్స్ లే కాదు, చాలా సిక్స్ లు ఇప్పటికే కూటమి ప్రభుత్వం కొట్టిందన్నారు..
అసలు, సొల్యూషన్ ఈవీఎంలది కాదు అన్నారు.. సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ వస్తే న్యాయబద్ధంగా ఎన్నిక జరుగుతుందన్నారు.. పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర భద్రతా బలగల పర్యవేక్షణ ఉంటుందన్నారు.. అప్పుడు ఎలాంటి మెకానిజం తీసుకువచ్చిన ఇబ్బంది లేదు అన్నారు.. అయితే, పేపర్ బ్యాలెట్ అయితే మరీ మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వైఎస్ జగన్.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యే... సొంత ప్రభుత్వాన్నే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారా? ఆయన దూకుడు ఇప్పుడు సహచర ఎమ్మెల్యేలను కూడా ఇరకాటంలో పడేస్తోందా? వేలాది మందితో... సొంత ప్రభుత్వం మీదే దండెత్తే ప్లాన్‌లో ఆ శాసనసభ్యుడు ఉన్నారా? అసలు ఎవరాయన? ఆ రాజకీయ వ్యూహం ఏంటి?
కరీంనగర్ కాంగ్రెస్ కయ్యాలకు కేరాఫ్‌గా మారిపోయింది. గతంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఉన్న వార్ కాస్తా...ఇప్పుడు లీడర్ల మధ్యకు చేరింది. క్యాడర్‌ను గాడిలో పెట్టి స్థానిక ఎన్నికలకు సమాయాత్తం చేయాల్సిన ఇద్దరు కీలక నేతల మధ్య రాజకీయ వేడి రాజుకుంది. మానకొండూర్ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ లోక్‌సభ సీటులో పోటీ చేసిన వెలిచాల రాజేందర్రావు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితి తలెత్తింది. వినాయక చవితి వేడుకల సాక్షిగా ఈ పోరు రోడ్డెక్కింది.
అధికారం పోగానే పార్టీని వదిలేయడం, తిరిగి పవర్ రాగానే ఘర్ వాపసీ అనడం సమకాలీన రాజకీయాల్లో సహజమైపోయింది. అంతా మా ఇష్టం అన్నట్టుగా జంపింగ్ జపాంగ్‌లు గెంతులేస్తుంటే... అటు రాజకీయ పార్టీలు కూడా రకరకాల కారణాలు, అవసరాలతో ఇలాంటి బ్యాచ్‌ని ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. దీంతో ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీలోకి చేరడం చాలామందికి పరిపాటిగా మారింది.
యూరియా కొరత, రైతు సమస్యలపై వైసీపీ ఏపీ వ్యాప్తంగా అన్నదాత పోరు పేరుతో ఆందోళన చేపట్టింది. పార్టీ కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభించిందిని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని ఆంక్షలు పెట్టినా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు రైతులు భారీగా తరలి వచ్చారని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరలు, ఉచిత బీమా, ఇన్పుట్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ ఆర్డీవో కార్యాలయాల వద్ద రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు సమర్పించారు.
ఆ ఏపీ మంత్రులు ఇద్దరూ.... తమ జిల్లాను పూర్తిగా గాలికొదిలేశారా? ప్రతిక్షానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి భయపడుతున్నారా? వాళ్ళు రెచ్చిపోతున్నా... వీళ్ళు కామ్‌గా ఉండటం వెనక వేరే లెక్కలున్నాయా? ఎవరా ఇద్దరు మినిస్టర్స్? ఎందుకు వాళ్ళలో స్పందనలు కరవయ్యాయి?
క్షవరం అయితేగానీ... వివరం తెలీదంటారు. ఆ యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్‌కు ఈ సామెత సరిగ్గా అతికినట్టు సరిపోయిందా? ఆయనకా క్షవరం కూడా అట్టా ఇట్టా కాకుండా.... మాడు మంటపుట్టేలా.... ఇక నాకొద్దు బాబోయ్, నన్నొదిలేయండ్రా నాయనోయ్... అంటూ గావు కేకలు పెట్టేలా అయ్యిందా? అందుకే మీకు, మీ రాజకీయాలకో దండంరా బాబూ... అంటూ సాష్టాంగ నమస్కారం పెట్టిమరీ చెబుతున్నారా? అంతలా తత్వం బోథపడ్డ ఆ నటుడు ఎవరు? ఏంటా దండాల కథ?
జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పొలిటికల్ ఇరకాటంలో పడుతున్నారా? ఒకప్పటి ఆయన అస్త్రమే ఇప్పుడు వైసీపీకి బ్రహ్మాస్త్రంగా మారబోతోందా? పవన్ చేతల మనిషి కాదు, ఉత్తి మాటల మనిషేనని ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రతిపక్షం ప్రత్యేక వ్యూహం సిద్ధం చేస్తోందా? ఇంతకీ ఏ విషయంలో పవన్ ఇరుకున పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు? ఏ విషయం మిస్‌ఫైర్ అవుతోంది? ఉప ముఖ్యమంత్రి ఎలా ఇరుకునపడుతున్నారు?