కేటీఆర్‌ని కలుస్తా.. ఎందుకు కలవకూడదు..? అంటూ ప్రశ్నించారు ఏపీ మంత్రి నారా లోకేష్.. వివిధ సందర్భాల్లో కేటీఆర్‌ను కలిశానన్న ఆయన.. కేటీఆర్‌ను కలవాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అడగాలా?.. రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా? అని ప్రశ్నించారు.
ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించడమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది కూటమి సర్కార్.. ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం..
టమోటా రైతును కదిలిస్తే కన్నీళ్లు కదలుతున్నాయి.. టమోటా చెట్టునుండి తెంపినా.. తెంపకపోయినా పెట్టుబడులు కూడా రాని దుర్భర పరిస్థితి రైతన్నకు ఏర్పడింది. ఉంటే అతివృష్టి.. లేదంటే అనావృష్టిలా మారింది టమోటా ధరల పరిస్థితి.మూడు నెలల క్రితం సెంచరీ దాటిన టమోటా ధరలు ప్రస్తుతం కిలో కనీసం 5 కూడా పలకడం లేదు.అధిక దిగుబడి నేపథ్యంలో పంటను రైతులు ఎలా అమ్ముకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది ....
ఏపీలో మెడికల్ కాలేజీల అంశం హాట్ టాపిక్‌గా మారింది.. కూటమి ప్రభుత్వం పది ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఆదోని.. మదనపల్లె. మార్కాపురం.. పులివెందుల.. పెనుగొండ.. పాలకొల్లు.. అమలాపురం.. నర్సీపట్నం.. బాపట్ల.. పార్వతీపురంలో ప్రైవేట్, పబ్లిక్ పార్టనర్షిప్ తో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది.. అయితే, దసరా మహోత్సవాలకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆహ్వానించారు దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు, అర్చకులు.
బైక్కొనే ప్లాన్ చేస్తున్నారా? అయితే, గుడ్ న్యూస్ చెప్పింది బజాజ్ ఆటో లిమిటెడ్.. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిన తర్వాత.. బైక్‌లతో పాటు త్రీ వీలర్, ఫోర్ వీలర్ వాహనాల ధరలపై ప్రభావం చూపనున్న విషయం విదితమే కాదు.. బజాజ్ మోటార్ సైకిళ్ల ధర రూ.20,000 వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది ఆ సంస్థ..
ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది.. ఆలయం పరిధిలో అర్ధరాత్రి డ్రోన్ ఎగరడం సంచలనంగా మారింది.. ఆలయ పరిసరాలపై అర్ధరాత్రి సమయంలో మరోసారి డ్రోన్ ఎగడరంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు..
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురవబోతున్నాయి.. వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా.. ఉత్తర కోస్తా మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.. ఇది సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్లు ఎత్తు లో ఆవరించి ఉందని.. దీని ప్రభావంతో రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది విశాఖపట్నం వాతావరణం కేంద్రం..