AP Liquor Scam: లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముగ్గురికీ సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. కేసులో ఈ ముగ్గురు కూడా ఏ31, ఏ32, ఏ33గా ఉన్నారు. వీరికి ఏసీబీ కోర్టు గతంలో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ ఆదేశాలను సిట్ అధికారులు హైకోర్టులో సవాలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేసింది. ఈ నెల 26లోపుగా ఏసీబీ కోర్టులో సరెండర్ కావాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై నిందితులు ముగ్గురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Read Also: Biker: శర్వానంద్ ‘బైకర్’ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్.. ఇట్స్ అఫీషియల్
సుప్రీం కోర్టు ముగ్గురు నిందితుల పిటిషన్లను బుధవారం విచారించింది. డిసెంబరు 15వ తేదీ వరకు హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. డిసెంబరు 15న విచారణ చేపడతామని చెప్పిన సుప్రీం కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సిట్ ను ఆదేశించింది. దీంతో అప్పటి వరకు నిందితులు సరెండర్ కావాల్సిన అవసరం లేదని నిందితుల న్యాయవాదులు తెలిపారు. నిందితులు ముగ్గురి తరపున న్యాయవాదులు ఈ విషయంపై ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చిందని ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత అందజేస్తామని, సుప్రీం ఆదేశాల కారణంగా నిందితులు సరెండర్ కాలేదని కోర్టుకు మెమెలో తెలిపారు.