CM Chandrababu: అమరావతి రైతుల ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఆర్డీఏ అధికారులు, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రి డాక్టర్ నారాయణ పాల్గొన్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు గత ప్రభుత్వ కాలంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని సీఎం పేర్కొన్నారు. వారి సమస్యలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని తక్షణ పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు. రైతులు చేసిన త్యాగం వృథా కావొద్దు అని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.. వారికి ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణ న్యాయం చేయాలి అని స్పష్టం చేశారు. త్వరలో రైతులతో ప్రత్యక్ష సమావేశం..
Read Also: Special : హైదరాబాద్ వైర్ లెస్ గా మారబోతుందా?.. అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ సాధ్యమేనా.?
రైతులు ఎదుర్కొంటున్న సాంకేతిక మరియు పరిపాలనా ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు త్వరలో వారితో సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ మరియు అధికారులకు సీఎం ఆదేశించారు. అమరావతి నగర నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. వేగం, నాణ్యత, ప్లానింగ్.. ఈ మూడు అంశాలలో రాజీ లేకుండా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఇక, కేబినెట్ ముందు పెండింగ్ అంశాలు పెట్టాలని సచించారు.. అమరావతి అభివృద్ధికి సంబంధించిన ఏమైనా పెండింగ్ అంశాలు ఉంటే వాటిని తక్షణం కేబినెట్ ముందు పెట్టాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.. రైతుల సమస్యలు అత్యవసరంగా పరిష్కారించాలని.. నిర్మాణాలు వేగవంతం చేయాలని.. నాణ్యతతో రాజీ పడకూడదని.. అధికారులు ఫీల్డ్‌లో పనిచేయాలి.. రైతులతో సమావేశం త్వరలో నిర్వహించాలి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మొత్తంగా అమరావతి అభివృద్ధి మరియు రాజధాని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాల నగరంగా తయారు చేయడమే లక్ష్యం అని తెలిపారు.