CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల నిర్మాణం, నిర్వహణలో నాణ్యతే లక్ష్యంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బుధవారం అమరావతిలో రహదారులు, భవనాల శాఖ (R&B) మరియు ఏపీ లింక్ (AP-Link) పై సమీక్ష నిర్వహించిన ఆయన, రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేందుకు మౌలిక వసతులు బలోపేతం చేయాలని సూచించారు. సమీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్–ఏపీ లింక్ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. ఏపీ లింక్ రాష్ట్రంలో రోడ్లు, గోదాములు, డ్రైపోర్టులు, సరుకు రవాణా సౌకర్యాలకు మద్దతుగా పనిచేసే సంస్థ కాబట్టి, దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: Keerthy Suresh: ఆ సినిమాలో నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేశ్
పాత్ హోల్ ఫ్రీ రోడ్లే లక్ష్యం..
రోడ్ల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించిన సీఎం చంద్రబాబు నాయుడు.. గుంతలులేని రహదారులే ప్రభుత్వ ప్రాధాన్యత. ఎక్కడా గుంతలు, ప్రమాదకర రోడ్లు కనిపించకూడదు అని పేర్కొన్నారు.. అలాగే రోడ్ల పనుల్లో నాణ్యత పరీక్షలు తప్పనిసరి చేయాలని, రోడ్లు నిర్మించిన తర్వాత నిర్వహణ బాధ్యతను కూడా స్పష్టంగా అమలు చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు రాష్ట్రాభివృద్ధిని మొదటి లక్ష్యంగా పెట్టుకుని పని చేయాలని సూచించిన సీఎం.. రాష్ట్ర అభివృద్ధి ముందుండాలి. మనం చేసే ప్రతి నిర్ణయం, చర్యలో డెవలప్‌మెంట్ ఫస్ట్ సూత్రం ప్రతిఫలించాలి అన్నారు..
రోడ్ల దిశగా కీలక చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు.. రోడ్ల పనులపై మానిటరింగ్ వ్యవస్థ బలోపేతం చేయాలి.. జిల్లావారీగా రోడ్ల నాణ్యత అంచనా వేయాలి.. పాత రహదారుల మరమ్మత్తులకు ప్రత్యేక నిధులు కేటాయించాలి.. ప్రతి రోడ్డు నిర్మాణానికి వారంటీ విధానం ఉండాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో రోడ్లు ప్రయాణానికి సౌకర్యవంతంగా, ప్రమాద రహితంగా ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏపీ లింక్‌ను బలోపేతం చేసి మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.