మెడికల్ కాలేజీల వివాదంపై స్పందిస్తూ.. అసలు, పీపీపీ, ప్రైవేటీకరణపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైద్యం, విద్య ప్రభుత్వ రంగంలోనే ఉండాలని స్పష్టం చేశారు రాఘవులు..
వైఎస్ జగన్మోహన్రెడ్డికి సవాల్ విసిరారు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఆరోగ్య శాఖ పై చర్చ కు తాను సిద్ధంగా ఉన్నానని, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనైనా ఇక ఎక్కడైనా చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.
వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం తగదని అంటున్నారు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్.. వైద్య కళాశాలలను ప్రభుత్వం నడపటానికి ఇబ్బంది ఏమిటి..? అంటూ ప్రశ్నించారు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు వన్ ప్లస్ వన్ గన్‌మెన్‌ను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. 2014 నుంచి 2019 వరకు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారాయన. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడంతో సెక్యూరిటీని ఉపసంహరించుకున్నారు. అయితే ... తాజాగా తనకు భద్రతా కారణాల రీత్యా ప్రొటెక్షన్ కావాలని ప్రభుత్వాన్ని అడిగారట మాజీ ఎమ్మెల్యే. ఏం... ఉన్నట్టుండి ఆయనకు ఏం ఆపద ముంచుకొచ్చింది?
రాష్ట్రం మెత్తం ఒక లెక్క, మా జిల్లా తీరు మరో లెక్క అంటున్నారు సిక్కోలు వైసీపీ ద్వితీయ శ్రేణి లీడర్స్. ఇక్కడ పార్టీకి బలమైన నాయకత్వం, క్యాడర్ బేస్ ఉంది. కానీ... సమన్వయం చేసుకోవడంలోనే చతికిలపడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే...ఇప్పుడప్పుడే కోలుకునే ఛాన్స్ కూడా ఉండబోదని పార్టీ వర్గాలో అంటున్నాయి. ఒకటి రెండు నియెజకవర్గాలు మినహా... ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్నిచోట్ల గ్రూప్స్ గోల ఉంది. పార్టీ కష్ట కాలంలో ఉన్నా..
చేసే పని ఏదైనా సరే... చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అవసరం. ఖచ్చితంగా రాజకీయాల్లో కూడా అలాంటి ఈక్వేషన్స్ ఉండాల్సిందే. ఉంటాయి కూడా. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఈ లెక్కల గురించిన చర్చే మొదలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళకు దగ్గర పడుతున్న క్రమంలో.... సర్కార్ పెద్దలు కూడికలు...తీసివేతల మీద ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.
212 మంది ఆంధ్రులు నేపాల్ లో 12 లొకేషన్ లలో ఉన్నారు. ఖాట్మండ్ లో ఎక్కువ మంది ఉన్నారు. టైం టు టైం మానటిరంగ్ జరుగుతోంది. ఖాట్మాండ్ నుంచి ప్రత్యేక విమానంలో రేపు ఆంధ్రుల ను నేపాల్ నుంచి తీసుకు వస్తాం.. ఆ ఫ్లైట్ శ్రీకాకుళం.. కడప లో ల్యాండ్ అవుతుందన్నారు..
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద హాటు ఘాటు చర్చలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఇక్కడ బైపోల్ తప్పలేదు. వచ్చే రెండు మూడు నెలల్లో ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అందుకోసం అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. సిట్టింగ్ సీటుగా బీఆర్ఎస్కు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున కాంగ్రెస్‌కు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది.