Cobra: విక్రమ్ ‘కోబ్రా’ తెలుగు హక్కులు ఎవరికంటే….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులో ఈ యేడాది తొలి ప్రథమార్ధంలో వచ్చిన అనువాద చిత్రాలు ‘కేజీఎఫ్, విక్రమ్’ మంచి విజయం సాధించాయి. దాంతో మన నిర్మాతలు, పంపిణీదారుల దృష్టి పరభాషా చిత్రాల తెలుగు హక్కులపై పడింది. అలా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్వీ ప్రసాద్, చియాన్ విక్రమ్ ‘కోబ్రా’ హక్కులను సొంతం చేసుకున్నారు. తొలి నుండి ప్రయోగాత్మక చిత్రాలకు విక్రమ్ ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాడు.
Also Read

అలానే దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తుకూ మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ చిత్రమే ‘కోబ్రా’. దీనిని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ తమిళంలో నిర్మించారు. ఆగస్ట్ 11న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా కనిపించనున్న ఈ చిత్రంలో విక్రమ్ గణితశాస్త్ర మేధావి పాత్రలో నటిస్తున్నారు. ఇండియన్ వెటరన్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ఇందులో కీలక పాత్ర పోషించడం విశేషం. మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కె.ఎస్. రవికుమార్, మృణాళిని రవి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ ‘కోబ్రా’కు సంగీతం అందిస్తున్నారు. మరి ‘కేజీఎఫ్, విక్రమ్’ మాదిరిగానే ‘కోబ్రా’సైతం విజయపథంలో సాగుతుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
Ramayana Part 1 Title: రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
-
Share Nani: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!