DJ Tillu : రాధికకు చెక్ పెట్టారా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన డీజే టిల్లు మూవీ.. సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. ఇందులో సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టర్‌ను చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. సిద్దు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్ ఈ సినిమా సక్సెస్‌కు ప్లస్ అయ్యాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్‌గా నేహా శెట్టి గురించి.. ఈ బ్యూటీ గ్లామర్ టిల్లు సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది. టిల్లు, రాధిక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ భలేగా వర్కౌట్ అయింది. ఇందులో రాధిక గురించి హీరో చెప్పే డైలాగ్స్ అదరహో అనిపించుకున్నాయి. రాధిక అట్లుంటది మనతోని.. అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. దాంతో మరోసారి రాధిక, టిల్లు జోడిని తెరపై చూసేందుకు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు ఆడియెన్స్. అందుకే డిజే టిల్లు మూవీకి పార్ట్ 2 రెడీ అవుతోంది.
Also Read
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
- Peddi - Irumudi: 'పెద్ది' ఓడిపోయింది.. 'ఇరుముడి' గెలవలేకపోయింది!
- Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
- Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
ఇక డిజే టిల్లుకి మించి ఈ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను లాంచనంగా ప్రారంభించినట్టు సమాచారం. అయితే ఈసారి రాధికకు చెక్ పెట్టబోతున్నారట. సీక్వెల్‌లో రాధిక పాత్ర పూర్తిస్థాయిలో ఉండదని సమాచారం.. ఆమెను అతిధి పాత్రకే పరిమితం చేయనున్నారట. రాధిక ప్లేస్‌లో టిల్లు కొత్త గర్ల్ ఫ్రెండ్‌తో షికారు చేసేందుకు రెడీ అవుతున్నాడట. అందులోభాగంగా.. ఓ కొత్త హీరోయిన్‌ను తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. దీంతో రాధిక లేకుండా ఈసారి టిల్లుగాడి లొల్లి ఎలా ఉంటుందనేది.. ఆసక్తికరంగా మారింది. ఇక హీరోయిన్‌తో పాటు మరికొన్ని కొత్త క్యారెక్టర్లు కూడా డీజె టిల్లు సీక్వెల్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాయట. ఇలాంటి విషయాల్లో త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక విమల్ కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఈ హిట్ సీక్వెల్‌ను.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మరి రాధిక లేకుండా టిల్లు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!