25 Years Of Pelli: హీరోగా వడ్డే నవీన్ కు, నాయికగా మహేశ్వరికి, విలన్ గా పృథ్వీరాజ్ కు పేరు సంపాదించి పెట్టిన చిత్రం ‘పెళ్ళి’. శ్రీరామ్ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎన్. రామలింగేశ్వరరావు నిర్మించిన ‘పెళ్ళి’ 1997 ఆగస్టు 8న విడుదలై ఘనవిజయం సాధించింది. అత్తాకోడళ్ళు తల్లీకూతుళ్ళలాగా మెలిగేవారు తక్కువ సంఖ్యలో కనిపిస్తుంటారు. కోడలి భవిష్యత్ కోసం కొడుకునే విడనాడిన అత్తలు కూడా ఉంటారని గతంలో కొన్ని సినిమాలు చూపించాయి. […]
పాతికేళ్ళ క్రితం షారుఖ్ ఖాన్ హవా విశేషంగా వీస్తోంది. షారుఖ్ నటించిన సినిమా వస్తే చాలు, కలెక్షన్ల వర్షం కురుస్తుందని అందరూ భావించేవారు. దక్షిణాదిన సైతం షారుఖ్ చిత్రాలు వసూళ్ళు విశేషంగా సాధించేవి. పాతికేళ్ళ క్రితం షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందిన ‘పర్ దేశ్’ సినిమా సైతం విజయపథంలో సాగింది. సుభాష్ ఘయ్ నిర్మించి, దర్శకత్వం వహించిన ‘పర్ దేశ్’ సినిమా 1997 ఆగస్టు 8న విడుదల విజయభేరీ మోగించింది. ‘పర్ దేశ్’ కథ ఏమిటంటే – […]
Bimbisara: ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ హీరోగా ఇంతవరకూ ఎనిమిది చిత్రాలు నిర్మించాడు. కానీ ఏ ఒక్క సినిమానూ స్టార్ డైరెక్టర్ తో అతను నిర్మించలేదు. ఆరేళ్ళ క్రితం 'ఇజం' సినిమాను పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేసినా అప్పుడు పూరి పరాజయాల్లో ఉన్నాడు. విశేషం ఏమంటే... ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ లో తొలి చిత్రం 'అతనొక్కడే' ను కొత్త దర్శకుడు సురేందర్ రెడ్డితో తీశాడు కళ్యాణ్ రామ్.
Bimbisara Success Press Meet: ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ హీరోగా హరికృష్ణ నిర్మించిన 'బింబిసార' చిత్ర బృందం క్లౌడ్ నైన్ లో ఉంది. తొలి ఆట నుండే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడంతో పలు కేంద్రాలలో థియేటర్లను పెంచుతున్నారు. మార్నింగ్ షో రిపోర్ట్ అందుకున్న వెంటనే చిత్ర బృందం నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో కళ్యాణ్ రామ్ ఈ చిత్ర విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
Chakrapani Jayanti Specialచక్రపాణి చమక్కు తెలుగు పాఠకులకు భలే ఇష్టం. ఆయన రాసిన అనువాద కథలు చదివి, అవి పరభాష కథలు కావని వాదించినవారూ ఉన్నారు. ఇప్పటికీ చక్రపాణి అనువదించిన రచనలు చదివితే అలాగే అనిపిస్తుంది. రాతగాడు కావడంతో ఆబాలగోపాలాన్నీ అలరించేందుకే ఆలోచించేవారు చక్రపాణి. ఆయన మేధస్సు నుండి పురుడు పోసుకున్నదే 'చందమామ' మాస పత్రిక.