Nagarjuna The Ghost Movie Shooting Completed: కింగ్ అక్కినేని నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’. పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్ విక్రమ్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఘోస్ట్-కిల్లింగ్ మెషిన్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇంటర్‌పోల్ ఆఫీసర్ విక్రమ్ గా నాగార్జున యాక్షన్ మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ప్రత్యేకంగా రూపొందించిన యాక్షన్ బ్లాక్ అందరినీ ఆకట్టుకుంది.
తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఒక స్పెషల్ వీడియో ద్వారా చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు తెలియజేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో నాగార్జున గన్ ఫైరింగ్ చేస్తూ కనిపించడం ఇంట్రస్టింగ్ గా వుంది. దీనితో పాటు నాగార్జున, సోనాల్ చౌహాన్ ఒక పెద్ద జీప్ దగ్గర ఇంటర్‌పోల్ అధికారులుగా కనిపిస్తున్న పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో వారి లుక్ అల్ట్రా-స్టైలిష్‌గా ఆకట్టుకుంది. అలాగే వారి దగ్గర వున్న మెషిన్ గన్‌లను చూస్తుంటే భారీ యాక్షన్ కి రెడీ అవుతున్నట్లుగా అర్ధమౌతోంది. ‘ది ఘోస్ట్’కి ప్రత్యేకమైన మ్యూజిక్ స్కోర్ అవసరం కావడంతో మేకర్స్ మార్క్ కె రాబిన్ ని ఎంచుకున్నారు.
భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది. నాగార్జున కల్ట్ క్లాసిక్, పాత్ బ్రేకింగ్ మూవీ శివ కూడా 1989లో అదే తేదీన విడుదల కావడం విశేషం. సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ‘ది ఘోస్ట్’లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
IT'S A WRAP for the Shoot! #Ghost 🗡
The killing machine is all set to be unleashed on October 5th… 💥💥
See you soon in a theatre near you. @iamnagarjuna @PraveenSattaru @SVCLLP @nseplofficial @sonalchauhan7 @bharattsaurabh @SonyMusicSouth pic.twitter.com/qmUMxBHzAr
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) August 8, 2022