నేడు (ఏప్రిల్ 16) విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి పుట్టినరోజు. గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో క్రియాశీల నటుడిగా వెలుగొందుతున్న జేడీ చక్రవర్తి ప్రస్తుతం తెలుగు పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో డిఫరెంట్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నారు. హిందీలో ‘ఏక్ విలన్ పార్ట్- 2’, ఆయుష్మాన్ ఖురానాతో కొత్త సినిమా, ‘దహిని’తో పాటు మరో థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. సోని, ప్రైమ్ కలిసి నిర్మిస్తున్న […]
సుమ కనకాల ప్రధాన పాత్రలో విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. ఈ నెల 22న రావాల్సిన ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. మే 6న మూవీని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. రేపు ఈ సినిమా ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉదయం 11.07 నిమిషాలకు ఆవిష్కరించబోతున్నాడు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ విలేజ్ డ్రామా టీజర్, పాటలతో చాలా ఆసక్తిని రేకెత్తించింది. […]
వాస్తవ సంఘటన ఆధారంగా, బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సి. ఎస్. గంటా తెరకెక్కిస్తున్న చిత్రం ‘విక్కి ది రాక్ స్టార్’. వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో 87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి (ఐ.ఎ.ఎఫ్.) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ బాధ్యతలు చేపట్టారు. పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించిన సునీల్ కశ్యప్ ‘విక్కి ది రాక్ స్టార్’కు బాణీలు కడుతున్నారు. విక్రమ్, అమృత చౌదరి […]
భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం నేపథ్యంలో ‘ది తాష్కెంట్ ఫైల్స్’ మూవీని తెరకెక్కించిన వివేక్ రంజన్ అగ్రిహోత్రి, ఆ తర్వాత కశ్మీర్ నుండి గెంటివేయబడ్డ పండిట్స్ ఉదంతాలతో ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీని తెరకెక్కించాడు. చిన్న చిత్రంగా విడుదలైన ఇది మూడు నాలుగు వారాల్లోనే రూ.250 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, పోస్ట్ పేండమిక్ సీజన్ లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దాంతో అదే ఊపుతో వివేక్ అగ్నిహోత్రి, ఇందిరా […]
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు అమ్మ రాజశేఖర్ మరోసారి వెండితెరపైకి ఆర్టిస్ట్ గా వస్తున్నాడు. అతనితో పాటు కట్ల ఇమ్మార్టెల్, అలీషా, షాలినీ ప్రధాన తారాగణంగా ‘ఎస్.ఎస్.డి’ (స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్) అనే సినిమా గురువారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. ఈ చిత్రాన్ని కట్ల రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో ఈడీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవానికి రాజశేఖర్, జీవిత, యస్.వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, రామ సత్యనారాయణ, సాయివెంకట్, పారిశ్రామికవేత్త ప్రశాంత్ కుమార్ తదితరులు హాజరయ్యారు. […]
యావద్భారతంలోనూ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ హవా విశేషంగా వీస్తోంది. దాంతో దక్షిణాది తారలు ఉత్తరాది వారినీ విశేషంగా ఆకర్షిస్తున్నారు. దక్షిణాది తారల విశేషాలను సైతం ఉత్తరాది వారు ఆసక్తిగా పరిశీలిస్తూ ఉండడం గమనార్హం! ఈ పరిశీలనలో దక్షిణాదిన తెలుగు, తమిళ భాషా చిత్రాలు అగ్రపథంలో సాగుతున్నా, కన్నడ చిత్రసీమలోనే ‘సినీ’సంబంధాలు అధికంగా ఉన్నట్టు ఓ పరిశీలనలో తేటతెల్లమయింది. ప్రస్తుతం కన్నడనాట టాప్ స్టార్ గా సాగుతున్న ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ సతీమణి రాధికా పండిట్ ఒకప్పటి […]
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు జన్మజన్మలబంధం ఉన్న కథలు బాగా అచ్చి వచ్చాయనే చెప్పాలి. ఏయన్నార్ కు హీరోగా మంచి పేరు సంపాదించి పెట్టిన ‘బాలరాజు’ జానపదం అలాంటి కథనే. ఆ తరువాత జనం మదిలో ఆయన బాలరాజుగా నిలిచారు. ఇక 1964లో రూపొందిన ‘మూగమనసులు’ రెండు జన్మల కథతో తెరకెక్కి, ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలచింది. అందువల్ల ఏయన్నార్ తో పూర్వజన్మగాథలు నిర్మిస్తే విజయం సాధించవచ్చునని దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ తలచారు. అంతకు ముందు ఏయన్నార్ […]
రచయితగా సాహితీరంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న గొల్లపూడి మారుతీరావు నటనలోనూ తన బాణీ పలికించారు. ఈ తరం వారికి గొల్లపూడి అనగానే ఓ సినిమా నటుడు అనే తెలిసి ఉండవచ్చు. కానీ, రచయితగా ఆయన కలం సాగిన తీరును గుర్తు చేసుకుంటే సాహిత్యాభిమానులకు ఈ నాటికీ పరవశం కలుగక మానదు. రచయితగా, కథకునిగా, నాటకరచయితగా, విలేఖరిగా, ఉపసంపాదకునిగా, సంపాదకునిగా పత్రికారంగంలో పలు విన్యాసాలు చేసిన గొల్లపూడి మారుతీరావు కలం అన్నపూర్ణా వారి ‘డాక్టర్ చక్రవర్తి’ (1964)లో […]
‘పూజా మన కాజా…. ఆమె లెగ్ పెడితే సూపర్ హిట్’ అంటూ ‘బీస్ట్’ను తెలుగులో విడుదల చేసిన ‘దిల్’ రాజు ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పొగడ్తలతో ముంచెత్తారు. ఆమె నటించిన ‘డీజే, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో’ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని ఉదాహరణగా పేర్కొన్నారు. పూజా హెగ్డే ఇప్పుడు ఆల్ ఇండియా హీరోయిన్, పాన్ ఇండియా హీరోయిన్, సినిమా సినిమాకూ ఆమె నటిగానూ ఎంతో పరిణతి చూపుతోందని కితాబిచ్చారు. అయితే […]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. దక్షిణాదిన ఒక్కరోజు తేడాలో రెడు బడా స్టార్స్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా ఆడియన్స్ తీర్పుకోరాయి. అందులో మొదటిది విజయ్ నటించిన ‘బీస్ట్’. ఇది బుధవారం అనగా ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. అయితే ఈ సినిమా మీద విజయ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. ‘బీస్ట్’ ఆడియన్స్ ను ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ […]