ఏషియన్ గ్రూప్స్ అధినేత ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ నారాయణ్ కె.దాస్ నారంగ్ గారి మృతి చెందారన్న విషయం నన్ను వ్యక్తిగతంగా బాధించింది. నైజాం డిస్ట్రిబ్యూటర్ గా ఆయన ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి దూరమవడం చాలా దురదృష్టం.. వారి కుటుంబ సభ్యులకు నా సంతాపాన్ని తెలుపుతూ.. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.. వల్లభనేని వంశీ.
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు నారాయణ్ కె. దాస్ నారంగ్ గారు సినీ ఇండస్ట్రీలో అజాత శత్రువు గా పేరొందారు . నైజాం లో ఎగ్జిబిటర్ మరియు పంపిణీదారులుగా విశేష సేవలందించారు .వారి మరణం విచారకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. కొడాలి నాని
“వింటే భారతం వినాలి… తింటే గారెలే తినాలి…” అని నానుడి. రామాయణ, భారత, భాగవతాలు మన భారతీయులకు పవిత్రగ్రంథాలు. ఈ పురాణగాథల ఆధారంగానే భారతీయ సినిమా, తెలుగు సినిమా ప్రాణం పోసుకోవడం విశేషం! తరువాతి రోజుల్లో భారతీయ పురాణగాథలను తెరకెక్కించడంలో తెలుగువారు మేటి అనిపించుకున్నారు. అందులో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్.టి.రామారావు నటించిన పౌరాణిక చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి. తెలుగులో రూపొందిన యన్టీఆర్ పౌరాణికాలు ఇతర భాషల్లోకి అనువాదమై అలరించాయి. భారతగాథకు అసలైన నాయకుడు అనిపించే భీష్ముని గాథతో […]
తాత గుణాలు మనవడికి రాకుండా పోవు అంటారు. అందునా తల్లివైపు తాత లక్షణాలు వస్తే మరింత మంచిదనీ చెబుతారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా నందా కొడుకు అగస్త్య కూడా తాతబాటలో పయనించాలని డిసైడ్ అయ్యాడు. స్కూల్ చదువుతున్న రోజుల్లోనే నటనలో శిక్షణ తీసుకున్నాడు అగస్త్య. అమితాబ్ బచ్చన్ ను సూపర్ స్టార్ గా నిలపడంలో జంట రచయితలు సలీమ్-జావేద్ పాత్ర ఎంతయినా ఉంది. ఈ రచయితల్లో ఒకరైన జావేద్ అక్తర్ కూతురు జోయా […]
కొన్ని జంటలను చూడగానే కనులకు విందుగా ఉంటుంది. ‘మహానటి’ సినిమా చూసిన వారికి అందులో టైటిల్ రోల్ పోషించిన కీర్తి సురేశ్ తరువాత చప్పున గుర్తుకు వచ్చేది సమంతనే! అందులో జర్నలిస్టు మధురవాణిగా సమంత అభినయం భలేగా ఆకట్టుకుంది. అలాగే ఆమెకు జోడీగా విజయ్ ఆంటోనీ పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. ఆ చిత్రంలో సమంత, విజయ్ కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంటుంది. ఈ జంట మరోమారు ప్రేక్షకులను పలకరించబోతోంది. యస్… సమంతతో విజయ్ దేవరకొండ మరోసారి జోడీగా […]
మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ‘ఆచార్య’ చిత్రంలోని “భలే భలే బంజారా…” పాట సోమవారం సాయంత్రం విడుదలవుతోందని తెలిసిన దగ్గర నుంచీ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూశారు. వారి ఆసక్తికి తగ్గట్టుగానే పాట కాకరేపుతోంది.”చీమలు దూరని చిట్టడివికి చిరునవ్వొచ్చింది… నిప్పు కాక రేగింది…” అంటూ పాట మొదలవుతుంది. పాటలో చిరంజీవి, రామ్ చరణ్ ఒకే రకమైన కాస్ట్యూమ్స్ ధరించడమే కాదు, డాన్సుల్లోనూ ఒకే స్టైల్ చూపించడం అభిమానులకు ఆనందం పంచే విషయం! “భలే […]
ఏప్రిల్ 18న అనూప్ రూబెన్స పుట్టిన రోజు సంగీతం పరబ్రహ్మ స్వరూపం! అది ఎవరిని ఎప్పుడు కరుణిస్తుందో చెప్పలేం. అనూప్ రూబెన్స్ ను ఆ సంగీతలక్ష్మి కటాక్షించింది. పిన్నవయసులోనే తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకొని, ఇప్పటికీ తనదైన బాణీ పలికిస్తూ తెలుగు సినిమా సంగీతప్రపంచంలో సాగుతున్నారు అనూప్. అనూప్ రూబెన్స్ అసలు పేరు ఈనోక్ రూబెన్స్ . 1980 ఏప్రిల్ 18న అనూప్ జన్మించారు. చిన్నతనంలోనే గిటార్, డ్రమ్స్ ప్లే చేస్తూ సాగారు. ఏదైనా ఉత్సవాల్లోనూ, చర్చిలోనూ […]
ప్రతిభ ఉండాలే కానీ, పట్టం కట్టడానికి చిత్రసీమ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎన్నో మార్లు రుజువయింది. విక్రమ్ విషయంలోనూ అదే జరిగిందని చెప్పవచ్చు. చిత్రసీమలో రాణించాలని విక్రమ్ చిన్నతనం నుంచీ కలలు కన్నారు. సినిమాల్లో తనకు లభించిన ప్రతి పాత్రకు న్యాయం చేయాలని తపించారు. తమిళ చిత్రాలలోనే కాదు కొన్ని తెలుగు సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో నటించారు. ఏదీ తగిన గుర్తింపు సంపాదించి పెట్టలేకపోయింది. ఇక నటనకు గుడ్ బై చెప్పి వేరే బాట పట్టాలనే […]
మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 23న విజయవాడలో అంగరంగవైభవంగా జరగనుంది. ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని వినిపిస్తోంది. అయితే, ఆ రోజున చిరంజీవి, రామ్ చరణ్ కలసి ముఖ్యమంత్రిని కలుసుకొనే అవకాశముందని, ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మాత్రం డైనమిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి ఛీఫ్ గెస్ట్ అని రూఢీగా తెలుస్తోంది. ‘ఆచార్య’ చిత్రంలోని పాటలు ఇప్పటికీ […]
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక యువతీయువకులకు నేడు ఆసక్తి కలిగిస్తోన్న అంశమేది అంటే సినిమా అని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఒకప్పుడంటే సినిమా అనేది పిచ్చి అనేవారు. నేడు సినిమా కూడా ఓ విద్యగా మారింది. అయితే అందరూ సినిమా పరిజ్ఞానం సంపాదించి, చిత్రాలు రూపొందించే స్థాయిలో లేరు. ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ తమ ‘ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిలిమ్ అండ్ కల్చర్’ ఆధ్వర్యంలో ‘స్క్రీన్ కల్చర్ ల్యాబ్’ నెలకొల్పారు. […]