Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్‌కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
- కాటారం రెవెన్యూ డివిజన్‌కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు
- ప్రజలకు భారీ ఊరట
- ప్రజలు, న్యాయవాదులు, స్థానిక నాయకులు హర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం రెవెన్యూ డివిజన్ ప్రజలకు భారీ ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం కాటారం డివిజన్‌లో జూనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) చేసిన ప్రతిపాదనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. న్యాయ, శాసన వ్యవహారాలు, న్యాయశాఖ కార్యదర్శి బి. పాపిరెడ్డి ఆదేశాల మేరకు ఈ సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కోర్టు ఏర్పాటుతో పాటు, అవసరమైన భవనాలు, సిబ్బంది నియామకం ఇతర వ్యయాల కోసం త్వరలోనే మరో జీవో జారీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇంతకు ముందు కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని కాటారం, మహదేవపూర్, మహముత్తారం, పలిమెల, మల్హర్ మండలాల ప్రజలు చిన్నపాటి న్యాయ సమస్యలకు కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. దీంతో గ్రామీణ ప్రజలు, ముఖ్యంగా సామాన్యులు, న్యాయం పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కొత్త కోర్టు మంజూరు చేయడంపై కాటారం డివిజన్ ప్రజలు, న్యాయవాదులు, స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై స్థానికంగానే న్యాయ సేవలు అందుబాటులోకి వస్తాయని, ప్రజల సమయం, డబ్బు ఆదా అవుతుందని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని, ప్రజలకు త్వరిత న్యాయం అందించడంలో ఉపయోగపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాకన్ ఇదే..!
- Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
- Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
- Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
తాజావార్తలు
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాకన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..