కార్మిక, కర్షక, శ్రామికుల దినోత్సవంగా మే 1వ తేదీ నిలచింది. ప్రపంచంలోని అనేక దేశాల్లో మే డేని నిర్వహిస్తున్నారు. విప్లవ దినోత్సవంగానూ కొందరు మే డేను అభివర్ణిస్తారు. ఏది ఏమైనా ప్రపంచ కార్మిక దినోత్సవంగా మే 1వ తేదీ జేజేలు అందుకుంటోంది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో పని గంటల తగ్గింపు కోసం 1837లో పోరాటం సాగింది. దాంతో అమెరికా అంతటా రోజుకు పది గంటలు పని గంటలుగా శాసనం చేశారు. ఆ స్ఫూర్తితోనే ఆ తరువాత 1862లో మన […]
తెలుగు చిత్రసీమలో కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు తమ బ్యానర్ లోగోలో మహానటుడు నటరత్న యన్.టి.రామారావు బొమ్మను పెట్టుకొని తమ అభిమానం చాటుకున్నాయి. పుండరీకాక్షయ్యకు చెందిన తారకరామ పిక్చర్స్ లోగోలో యన్టీఆర్ శ్రీరాముని గెటప్ లో కనిపిస్తారు. ఇక సి.అశ్వనీదత్ తమ వైజయంతీ మూవీస్ బ్యానర్ లోగోలో పాంచజన్యం పూరిస్తోన్న శ్రీకృష్ణునిగా యన్టీఆర్ బొమ్మనే పొదువుకున్నారు. అదే తీరున యన్టీఆర్ అభిమాని అయిన దర్శకుడు వై.వి.యస్. చౌదరి తాను నిర్మాతగా మారి ‘బొమ్మరిల్లు’ పతాకంపై తొలి ప్రయత్నంగా […]
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజుకు తిరుమల వేంకటేశ్వర స్వామి అంటే అపార నమ్మకం. అందుకే తన స్వగ్రామంలో ఆయన వేంకటేశ్వరస్వామి కోవెలను నిర్మించారు. అలానే తాను నిర్మించిన ప్రతి చిత్రం విడుదల కాగానే తిరుమల వెళ్ళి తలనీలాలు సమర్పించి, స్వామిని దర్శించుకుని రావడమన్నది ‘దిల్’ రాజు కు కొన్నేళ్ళుగా ఉన్న అలవాటు. తాజాగా ఆయన అన్న నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం కూడా మొదలు పెట్టారు. ఇలా ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ధాన్యాన్ని ‘మా […]
సినిమా కథలు, నిర్మాణం – వీటిలో ఎన్నెన్నో వైవిధ్యాలు. ఆ జానర్స్ పై ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘ఏజీబీవో’ ఓ షార్ట్ ఫిలిమ్ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ‘అవేంజర్స్’ మూవీస్ ను తెరకెక్కించిన అంటోనీ, జో రస్సోకు చెందిన ‘ఏజీబీవో’ సంస్థ ద్వారా సాగే కాంటెస్ట్ ఇది. మే 1వ తేదీ సాయంత్రం ఐదు గంటలకల్లా సంస్థకు చెందిన “www.agbo.com” కు ఎంట్రీస్ పంపించాలి. సమయం లేదు…కానీ ప్రతిభావంతులు అర నిమిషమైనా ఇట్టే ఉపయోగించుకోగలరు. యాక్షన్, కామెడీ, […]
సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాడేజ్ కష్టాలు తీరలేదు. ఇటీవల ఆమెను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఓ కేసు విషయంలో సుదీర్ఘ సమయం విచారించింది. తాజాగా ఆమెకు చెందిన రూ. 7.27 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. రూ. 200 కోట్ల స్కామ్ లో సూత్రధారి అయిన సుకేశ్ చంద్రశేఖర్ ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఊచలు లెక్కపెడుతున్నాడు. అతనితో సాన్నిహిత్యం ఉన్న శ్రీలంకకు చెందిన హీరోయిన్ జాక్విలిన్ […]
కంగనా పేరు వినగానే ఫైర్ బ్రాండ్ అని స్ఫురిస్తుంది ఎవరికైనా. సోషల్ మీడియాలో అమ్మడి ట్వీట్స్ ఎలాంటి వివాదాలను సృష్టిస్తాయో ఏమో కానీ ఇప్పుడు కంగనా కొత్త మార్గం ఎంచుకున్నట్లు అనిపిస్తోంది. ‘క్వీన్’తో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న కంగనా రనౌత్ ఆ తర్వాత పలు సందర్భాల్లో తన గ్లామర్ యాంగిల్ ను ప్రదర్శిస్తూ వచ్చింది. 35 సంవవత్సరాల ఈ హాటీ తాజాగా ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు బికినీ ట్రీట్ తో ఆశ్చర్యపరిచింది. తన తాజా […]
తన చిత్రాలలో ఏదో ఒక వైవిధ్యం ప్రదర్శించాలని తపించేవారు ప్రముఖ నిర్మాత, దర్శకుడు యు.విశ్వేశ్వరరావు. ‘విశ్వశాంతి’ పతాకంపై విశ్వేశ్వరరావు నిర్మించిన పలు చిత్రాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. నిర్మాతగా, దర్శకునిగా, రచయితగా విశ్వేశ్వరరావు తనదైన బాణీ పలికించారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు దేశవిదేశాలలో ప్రదర్శితమయ్యాయి. ప్రభుత్వ అవార్డులనూ, ప్రేక్షకుల రివార్డులనూ పొందాయి. నేటికీ ఆ నాటి సినీజనం ‘విశ్వశాంతి’ విశ్వేశ్వరరావు అనే ఆయనను గుర్తు చేసుకుంటారు. మహానటుడు యన్టీఆర్ కు విశ్వేశ్వరరావు వియ్యంకుడు. యన్టీఆర్ తనయుడు, ప్రముఖ […]
‘ఈ యుగం నాది’ అని శ్రీశ్రీ చెప్పడంలో కొందరికి ఆనాడు అతిశయోక్తిగా అనిపించి ఉండొచ్చు. కానీ ఈ నాటికీ ఏ సందర్భంలోనైనా మహాకవి శ్రీశ్రీని, ఆయన కవితలను తలచుకోకుండా ఉండలేం!ఈ దేశంలో ఏ సంఘటన జరిగినా దానికి శ్రీ శ్రీ గీతానికి అన్వయిస్తూ ఆలోచించడం రెండు మూడు తరాలకు అలవాటుగా మారిపోయింది. భవిష్యత్ లోనూ అదే సాగుతుంది. 1910లో విశాఖ పట్నంలో సంప్రదాయ కుటుంబంలో పుట్టిన శ్రీరంగం శ్రీనివాసరావుకు పదిహేనేళ్ళ వయసులోనే వెంకట రమణమ్మతో వివాహం జరిగింది. […]
విష్ణు, కేథరిన్ థ్రెసా, ‘కేజీఎఫ్’ ఫేమ్ రామచంద్రరాజు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దంతులూరి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్ లో రజనీ కొర్రపాటి ఈ చిత్రం నిర్మించారు. అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ సినిమా ఈ నెల 30న విడుదల కావాల్సింది. కానీ దీన్ని మే 6కి వాయిదా వేశారు దర్శకనిర్మాతలు. ఈ విషయాన్ని దర్శకుడు చైతన్య దంతులూరి చెబుతూ, ”వైవిధ్యమైన కథాంశాంతో తెరకెక్కిన ఈ సినిమాను సమ్మర్ […]
మోహన్‌లాల్, జీతు జోసెఫ్ కలయికలో వచ్చిన ‘దృశ్యం’ దాని సీక్వెల్ ‘దృశ్యం 2’ ఘన విజయం సాధించాయి. ఇప్పుడు వారు హ్యాట్రిక్ సినిమాగా ‘ట్వల్త్ మేన్’తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా కూడా వీరి ముందు సినిమా ‘దృశ్యం2’ లాగే డిజిటల్ లో రిలీజ్ కానుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో నేరుగా విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రతి వ్యక్తికి సొంతదైన జీవితం, వ్యక్తిగత జీవితం, రహస్య జీవితం అనే మూడు […]