‘కె.జి.ఎప్ 2’ రిలీజ్ కి ముందు సినిమా తరువాత భాగంపై ఎలాంటి కామెంట్ చేయనప్పటికీ సినిమా ముగింపులో ‘కెజిఎఫ్3’ ఉంటుందనే సూచన ఇచ్చారు మేకర్స్. అయితే దీని గురించి ఏ ఇంటర్వ్యూలోనూ ప్రశాంత్ నీల్ కానీ, యశ్ కానీ ఎక్కడా మూడవ భాగం గురించి మాట్లాడలేదు. తాజాగా ఓ హాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో యష్ ఆడియన్స్ కి చెప్పడానికి చాలా కథలు మిగిలి ఉన్నాయని అంటూ మూడో భాగం తప్పక ఉంటుందని తెలియచేశాడు. ‘కెజిఎఫ్ 2’ షూటింగ్ టైమ్ లోనే ప్రేక్షకులకు చెప్పడానికి చాలా ఉందని అర్థం అయింది. అందుకే పార్ట్ 3 వచ్చేలా క్లూని వదిలాము. అయితే అది ఎప్పుడు అనేది ఖచ్చితంగా చెప్పలేమని అన్నారు. ఇక ఇటీవల ‘బహుబలి’ సీరీస్ ఓ పాటు ‘కెజిఎఫ్’ ప్రాంచైజ్, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలఓ భారతదేశం ఒకే యూనిట్ గా మారిందని, ప్రస్తుతం భారతీయ సినిమా వైభవంగా పరిఢవిల్లుతోందని ధృవీకరించాడు. అంతే కాదు ప్రపంచమే ఇప్పుడు మన భూభాగంగా మారిందంటూ త్వరలో మొత్తం ప్రపంచ బాక్సాఫీస్‌నే శాసిస్తామంటున్నాడు యశ్. అంటే ‘కెజిఎఫ్3’తో యశ్ ప్రపంచంపై దండయాత్ర చేయబోతున్నాడన్న మాట. ఏం జరుగుతుందో చూడాలి.