Shubman Gill: ఈ రోజు నా రోజు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
- గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంతోషం
- ఆర్సీబీని 160 పరుగులలోపే ఆపడం గొప్ప విషయం
- విజయానికి ప్రధాన కారణం ఫీల్డింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill on GT Win Over RCB: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతంగా రాణించారని ప్రశంసలు కురిపించారు. బలమైన ఆర్సీబీ జట్టును 160 పరుగులలోపే ఆపడం గొప్ప విజయమని పేర్కొన్నాడు. ఈ పిచ్‌పై ఆర్సీబీని తక్కువ పరుగులకే నియంత్రించడం నిజంగా సంతృప్తినిచ్చే విషయం అని చెప్పాడు. ఈ విజయానికి ప్రధాన కారణం ఫీల్డింగ్ అని గిల్ స్పష్టం చేశాడు. ఈ రోజు తన రోజు అని, తాను చాలా హ్యాపీగా ఉన్నట్లు శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు.
‘ఈ పిచ్‌పై ఆర్సీబీ లాంటి పటిష్ట జట్టును 160 పరుగులలోపే ఆపడం చాలా సంతృప్తినిచ్చింది. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మా విజయంలో ఫీల్డింగ్ కీలక పాత్ర పోషించింది. కొన్ని మ్యాచ్‌ల్లో మేము ఫీల్డింగ్‌లో తేలిపోయాం. కానీ ఈరోజు ప్రతి ఆటగాడు కలిసికట్టుగా ఆడాడు. ఫీల్డింగ్‌లో ఎనర్జీ చాలా బాగుంది. ముఖ్యంగా రెండో ఓవర్ తర్వాత విరాట్ భాయ్ కొన్ని పరుగులు కొట్టినా.. మేమంతా తిరిగి కలిసి పోరాడి మ్యాచ్‌ను కంట్రోల్‌లోకి తీసుకువచ్చాం. అది మ్యాచులో చాలా కీలకంగా మారింది’ అని శుభ్‌మన్ గిల్ తెలిపాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
‘పవర్‌ప్లేలో దూకుడుగా ఆడాలని ముందే అనుకోలేదు. నేను నా సహజ శైలి ఆటనే ఆడాను. మొదటి బంతికి కొంచెం అదృష్టం కలిసొచ్చింది. రెండో బంతి తర్వాత నేను మంచి ఫ్లోలోకి వచ్చాను. అప్పుడే ఇవాళ నా రోజు కావచ్చు అనిపించింది. నాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. అందుకే బౌలర్లపై దాడి చేయాలని అనుకున్నాను. రాహుల్ తెవాటియా మా జట్టుకు చాలా ముఖ్యమైన ఆటగాడు. అతడు మ్యాచ్‌ను ఫినిష్ చేయడం చాలా సంతోషంగా ఉంది. టైమ్‌అవుట్ సమయంలో ఇదే విషయంపై మాట్లాడుకున్నాం. మధ్యలో కొన్ని వికెట్లు కోల్పోయినా.. చివర్లో అతడు కీలక పరుగులు చేశాడు. అందరూ తమ వంతు పాత్ర పోషించారు. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని గిల్ చెప్పాడు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?