Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఆయన లైనప్‌లో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో ‘కల్కి 2898 AD’ సీక్వెల్ కూడా ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ వండర్‌కు సంబంధించి తాజాగా అప్డేట్ బయటకు వచ్చింది. ఈ రోజు నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని ఇందులో ప్రభాస్ కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.
గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని ఒక భారీ సెట్‌లో ‘కల్కి 2’ చిత్రీకరణ జరుగుతోంది. కొత్త షెడ్యూల్‌లో ప్రభాస్ పై ఈ నెల 4 నుండి 7 వరకు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి భాగంలో కర్ణ, భైరవగా రెండు విభిన్న పాత్రల్లో అలరించాడు ప్రభాస్. కానీ సీక్వెల్‌లో మాత్రం మరో సరికొత్త లుక్‌లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరచనున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా.. ఈ సీక్వెల్‌లో ప్రభాస్ పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతోంది. ఇక వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా తన అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు. కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్‌గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మరింత భయంకరంగా కనిపించనున్నారు. వీరిద్దరికీ, ప్రభాస్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు రెండో భాగంలో హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తుండగా.. హాలీవుడ్ స్థాయి విజువల్స్, అద్భుతమైన సెట్టింగ్స్‌తో రూపొందుతున్న‘కల్కి 2’పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!