సినిమా కథలు, నిర్మాణం – వీటిలో ఎన్నెన్నో వైవిధ్యాలు. ఆ జానర్స్ పై ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘ఏజీబీవో’ ఓ షార్ట్ ఫిలిమ్ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ‘అవేంజర్స్’ మూవీస్ ను తెరకెక్కించిన అంటోనీ, జో రస్సోకు చెందిన ‘ఏజీబీవో’ సంస్థ ద్వారా సాగే కాంటెస్ట్ ఇది. మే 1వ తేదీ సాయంత్రం ఐదు గంటలకల్లా సంస్థకు చెందిన “www.agbo.com” కు ఎంట్రీస్ పంపించాలి. సమయం లేదు…కానీ ప్రతిభావంతులు అర నిమిషమైనా ఇట్టే ఉపయోగించుకోగలరు.
యాక్షన్, కామెడీ, హారర్, సెంటిమెంట్, సైన్స్ ఫిక్షన్… ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా కథల్లో పలు జానర్స్ ఉన్నాయి. అలాగే ఫిలిమ్ మేకింగ్ లోనూ అనేక జానర్స్ చోటు చేసుకున్నాయి. వీటిలో ఏవైనా మూడు జానర్స్ ను ఎంచుకొని, వాటిని మిళితం చేసి కానీ, విశ్లేషిస్తూ కానీ ఓ షార్ట్ ఫిలిమ్ తీయాలి. అందుకే ఈ కాంటెస్ట్ కు ‘నో స్లీప్ టిల్ ఫిల్మ్ ఫెస్ట్’ అని పేరు పెట్టారు. ఔత్సాహికులు ‘ఏజీబీవో’ వెబ్ సైట్ కు వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
https://twitter.com/agbofilms/status/1520191227228041216?s=24&t=KOnmEun6sGWMY_jHLWj5jg