IPL 2026 Playoffs Chances: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేస్.. గుజరాత్‌కు చిగురించిన ఆశలు, ఆ 5 టీమ్స్ ఇక ఇంటికేనా?
- కీలక దశకు ఐపీఎల్ 2026
- ప్రతి టీమ్ 8 మ్యాచ్‌లను ఆడేశాయి
- రసవత్తరంగా ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేస్
- ఆ 5 టీమ్స్ ఇక ఇంటికేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 Playoff Chances for 10 Teams: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 కీలక దశకు చేరుకుంది. లీగ్ దశలో ప్రతి టీమ్ 8 మ్యాచ్‌లను ఆడేశాయి. ఇకపై ప్రతి మ్యాచ్ ప్లేఆఫ్స్ సమీకరణాలను ప్రభావితం చేయనున్న నేపథ్యంలో జట్ల మధ్య పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న జట్లు ప్లేఆఫ్స్‌కు దగ్గరగా ఉన్నాయి. కొన్ని జట్లకు ఇటీవలి విజయాలతో ప్లేఆఫ్స్ ఆశలు చిగురించాయి. ఇక కొన్ని టీమ్స్ దాదాపుగా రేసు నుంచి తప్పుకున్నట్టే అని చెప్పాలి.
ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆడిన 8 మ్యాచ్‌లలో ఒకే ఓటమిని ఎదుర్కొన్న పంజాబ్.. ప్లేఆఫ్స్‌కు చాలా దగ్గరగా ఉంది. మరో రెండు విజయాలు సాధిస్తే అధికారిక బెర్త్ దక్కుతుంది. ఒకటి గెలిచినా కూడా అవకాశాలు ఉంటాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలో 12 పాయింట్లతో టాప్-4లో బలమైన స్థితిలో ఉన్నాయి. ఈ మూడు జట్లు రెండేసి విజయాలు సాధిస్తే.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
మరోవైపు గుజరాత్ టైటాన్స్ 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయంతో గుజరాత్‌కు ప్లేఆఫ్స్ ఆశలు చిగురించాయి. అవకాశాలు ఉన్నప్పటికీ.. మిగిలిన మ్యాచ్‌లలో మెరుగైన ప్రదర్శన అవసరం. ఇక నుంచి ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి గుజరాత్ ముందు ఉంది. కనీసం మూడు విజయాలు సాధిస్తే టాప్ 4లో నిలవనుంది. ఆరేసి పాయింట్లతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు జట్లు చివరి ఆరు మ్యాచ్‌లలో గెలిస్తేనే ప్లేఆఫ్స్ చేరుకుంటాయి. ప్రస్తుత ఫామ్ చూస్తే.. అన్ని విజయాలు కష్టమనే చెప్పాలి.
కోల్‌కతా నైట్ రైడర్స్ (5 పాయింట్స్) ముంబై ఇండియన్స్ (4 పాయింట్స్), లక్నో సూపర్ జెయింట్స్ (4 పాయింట్స్) జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే. ఈ జట్లు వరుస విజయాలు సాధించినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ మూడు టీమ్స్ ఇప్పటికే ఇంటిదారి పెట్టినట్టే. ఈ వారం ఐపీఎల్ 2026లో అత్యంత కీలకంగా మారనుంది. ప్రతి మ్యాచ్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే జట్లను నిర్ణయించే అవకాశం ఉంది. టాప్ జట్లు తమ స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు పోరాడుతుండగా.. మిగతా జట్లు చివరి ఆశగా పోటీ పడనున్నాయి.
తాజావార్తలు
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!