Official Teaser :మోహన్ లాల్ తదుపరి చిత్రం ‘ట్వల్త్ మేన్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోహన్‌లాల్, జీతు జోసెఫ్ కలయికలో వచ్చిన ‘దృశ్యం’ దాని సీక్వెల్ ‘దృశ్యం 2’ ఘన విజయం సాధించాయి. ఇప్పుడు వారు హ్యాట్రిక్ సినిమాగా ‘ట్వల్త్ మేన్’తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా కూడా వీరి ముందు సినిమా ‘దృశ్యం2’ లాగే డిజిటల్ లో రిలీజ్ కానుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో నేరుగా విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రతి వ్యక్తికి సొంతదైన జీవితం, వ్యక్తిగత జీవితం, రహస్య జీవితం అనే మూడు విభిన్న జీవితాలు ఉంటాయని ఈ టీజర్ చెబుతోంది. టీజర్ చివర్లో ఫైనల్ విజిల్ వేసే సమయం వచ్చింది అనే మోహన్‌లాల్ డైలాగ్ టీజర్ పై ఆసక్తిని పెంచుతుంది. జీతూ, మోహన్‌లాల్ మరో థ్రిల్లర్ తో మన ముదుకు వస్తున్నట్లు అర్థం అవుతోంది.ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, సైజు కురుప్, శివద, అను సితార, అనుశ్రీ, ప్రియాంక నాయర్, అను మోహన్ ఇతర కీలక పాత్రథారులు. దీని రిలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది. ఇక మోహన్ లాల్ ‘దృశ్యం 2క, బ్రో డాడీ’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్ట్ గా మరోసారి ఓటీటీలో రాబోతున్నాడు. మరి మోహన్ లాల్ ఓటీటీలో హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!