Income Tax Bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. సెలక్షన్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు కొత్త బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. బిహార్ ఓటర్ల సమగ్ర సవరణపై విపక్షాలు ఆందోళన నిర్వహిస్తుండటంతో సభలో బిల్లుపై చర్చకు తావులేకుండా పోయింది. బిల్లు ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే ఎలాంటి చర్చా జరగకుండానే మూజువాణి ఓటుతో సభామోదం పొందింది. బిల్లు పాసైన అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. ఈ […]
Anas Al-Sharif: గాజాపై ఇజ్రాయెల్ బీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని అల్ షిఫా ఆసుపత్రిపై జరిపిన దాడుల్లో ప్రముఖ మీడియా సంస్థ అల్ జజీరాకు చెందిన ఐదుగురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే మరణించిన వారిలో ఒకరు హమాస్ ఉగ్రవాది అని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. కానీ అల్-జజీరా న్యూస్ ఛానెల్ మాత్రం అతడిని జర్నలిస్ట్ అని పిలుస్తోంది. ఇంతకు గాజాలో మృతి చెందిన అనాస్ అల్-షరీఫ్ ఎవరు? చావుకు ముందు ఆయన […]
India Strongly Condemns: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికా పర్యటనలో భాగంగా భారత్‌పై చేసిన అణుబాంబు బెదరింపు వ్యాఖ్యలను ఇండియా తీవ్రంగా ఖండించింది. అణ్వాయుధాలతో బెదిరించడం పాకిస్థాన్‌కు పాత అలవాటని, ఇలాంటి ప్రకటనలు ఎంత బాధ్యతారహితంగా ఉన్నాయో అంతర్జాతీయ సమాజం స్వయంగా చూస్తుందని అన్నారు. ఉగ్రవాద సంస్థలతో కుమ్మక్కైన దేశాన్ని.. అణ్వాయుధాల నియంత్రణ, బాధ్యతలో విశ్వసించలేమనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. READ MORE: Yellamma: ‘ఎల్లమ్మ’ ఉన్నట్టా? లేనట్టా? బెదిరింపులకు తలవంచేది లేదు.. పాకిస్థాన్ […]
Adaso Kapessa: మణిపూర్‌లోని ఒక మారుమూల గ్రామం నుండి జాతీయ భద్రతలో ముందంజలో ఉన్న ఆమె ప్రయాణం కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, భారతదేశం అంతటా మహిళలకు, ముఖ్యంగా సాంప్రదాయకంగా పురుషాధిక్య రంగాలలో అడ్డంకులను ఛేదించాలనుకునే వారికి స్ఫూర్తిదాయకమైనది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో ప్రధాని వెనుక నిలబడిన ఒకరు యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. నల్లటి సూట్, ఇయర్‌పీస్‌లో ఉన్న ఆ మహిళా ఆఫీసర్ ఫోటో వైరల్ సోషల్ మీడియాలో […]
cop arrested: బైక్ దొంగతనం కేసులో ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తీరా చూస్తే ఆయనో పోలీసు కానిస్టేబుల్ అని బయటపడింది. ఏంటీ స్టోరీ అని పోలీసులు వారి తీరులో అరెస్ట్ చేసిన వ్యక్తిని ఎంక్వైరీ చేస్తే అసలు నిజాలు బయటికి వచ్చాయి. అసలు ఆ వ్యక్తి నిజంగానే పోలీసో కాదో, ఆయనకు దొంగతనాలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ MORE: HYDRA: ఉద్యోగుల జీతాలపై స్పష్టత.. హైడ్రా […]
Supreme Court: ఇండియన్ ఆర్మీ తీరుపై సోమవారం దేశ సర్వోన్నత న్యాయ స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత సైన్యంలోని జడ్జి అడ్వొకేట్ జనరల్ (లీగల్) బ్రాంచి పోస్టుల్లో నియామకాల కోసం అనుసరిస్తున్న 2:1 రిజర్వేషన్ నిష్పత్తి విధానం సరికాదని, దాన్ని అమలు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహిళలపై పరిమితి పెట్టి ఖాళీ పోస్టులను పురుషులకు రిజర్వ్ చేయకూడదని తేల్చిచెప్పింది. లింగ తటస్థతకు నిజమైన అర్ధం.. స్త్రీ, పురుష భేదం లేకుండా అత్యంత ప్రతిభావంతులైన అభ్యర్థులను […]
Stranger Helps: ఓ వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో రాఖీ సమయంలో పరిచయం లేని ఓ మహిళ ద్వారా తనకు ఏ విధంగా సాయం అందిందో పంచుకున్నాడు. తాను పూర్తిగా ధైర్యం కోల్పోయినప్పుడు, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తను నా దగ్గర వచ్చి సాయం చేసిందని తెలిపారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందని కామెంట్లు పెడుతున్నారు. అసలు ఏంటా కథ.. ఆమె చేసిన సాయం ఏంటి అనేది ఈ […]
Warren Buffett: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన పెట్టుబడిదారుడిగా గుర్తింపు పొందిన ఫేమస్ పర్సన్ వారెన్ బఫెట్. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో వారెన్ బఫెట్‌ను ఒక తిరుగులేని రారాజు అని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. ప్రస్తుతం ఆయన సంపద విలువ 140 బిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.12 లక్షల కోట్లు. మీకు తెలుసా.. ఇన్ని లక్షల కోట్లకు అధిపతి అయిన ఆయనకు.. బంగారంలో పైసా కూడా పెట్టుబడి పెట్టలేదంటే నమ్ముతారా.. కానీ ఇదే నిజం.. […]
Elumalai Movie: హీరోయిన్ రక్షిత సోదరుడు రాన్నా హీరోగా, ప్రియాంక ఆచార్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘ఏలుమలై’. నరసింహా నాయక్ (రాజు గౌడ) సమర్పణలో తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్ బ్యానర్లపై యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి రచన, మాటలు, దర్శకత్వం పునీత్ రంగస్వామి వహించారు. తాజాగా ఈ చిత్రం నుంచి సింగర్ మంగ్లీ పాడిన ‘కాపాడు దేవా’ అనే పాటను విడుదల చేశారు. […]
70mm Entertainments: ప్రముఖ నిర్మాణ సంస్థ 70mm ఎంటర్టైన్మెంట్స్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆరు కొత్త సినిమాల స్క్రిప్టులు లాక్ చేస్తూ ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించింది. వచ్చే రెండేళ్లలో ఈ ఆరు సినిమాలను వరుసగా తెరకెక్కించి విడుదల చేయబోతుంది. వేర్వేరు జానర్స్‌లో క్వాలిటీ స్టోరీటెల్లింగ్‌కి ప్రాధాన్యం ఇస్తూ ప్రేక్షకుల్ని అలరించేలా కొత్త సినిమాలను ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాతలు విజయ్చిల్లా, శశిదేవిరెడ్డి తెలిపారు. ట్రాక్ రికార్డ్ ఇదే.. 70mm ఎంటర్టైన్మెంట్స్ను విజయ్చిల్లా, శశిదేవిరెడ్డి స్థాపించారు. […]