India Strongly Condemns: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికా పర్యటనలో భాగంగా భారత్‌పై చేసిన అణుబాంబు బెదరింపు వ్యాఖ్యలను ఇండియా తీవ్రంగా ఖండించింది. అణ్వాయుధాలతో బెదిరించడం పాకిస్థాన్‌కు పాత అలవాటని, ఇలాంటి ప్రకటనలు ఎంత బాధ్యతారహితంగా ఉన్నాయో అంతర్జాతీయ సమాజం స్వయంగా చూస్తుందని అన్నారు. ఉగ్రవాద సంస్థలతో కుమ్మక్కైన దేశాన్ని.. అణ్వాయుధాల నియంత్రణ, బాధ్యతలో విశ్వసించలేమనే అనుమానాన్ని వ్యక్తం చేసింది.
READ MORE: Yellamma: ‘ఎల్లమ్మ’ ఉన్నట్టా? లేనట్టా?
బెదిరింపులకు తలవంచేది లేదు..
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అణుబాంబు బెదరింపులపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. ఆయన తన ప్రకటనలో అమెరికాను ప్రస్తావిస్తూ.. ఇండియాతో మంచి సంబంధాలు కలిగి ఉన్న దేశం నుంచి ఇటువంటి ప్రకటనలు చేయడం విచారకరమని చెప్పారు. అణుబెదిరింపులకు
తలొగ్గబోమని ఇండియా ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. జాతీయ భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. పాక్ మిలిటరీకి అమెరికా మద్దతిచ్చినప్పుడల్లా.. వారు తమ నిజస్వరూపాన్ని బయటపెడుతూనే ఉంటారు. పాక్‌ను ఆ దేశాన్ని సైన్యమే నియంత్రిస్తోంది. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఈ ప్రాంతంతో పాటు ప్రపంచం మొత్తానికి ముప్పు ఎదురైనట్లే అని కేంద్రంలోని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి.
అసిమ్ మునీర్ వ్యాఖ్యలు..
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఫ్లోరిడాలో ప్రవాస పాకిస్థానీయులతో మాట్లాడుతూ.. పాకిస్థాన్ అణ్వస్త్ర సంపన్న దేశం అని చెప్పాడు. ఒకవేళ భవిష్యత్తులో న్యూఢీల్లీ నుంచి తమ అస్థిత్వానికి ముప్పు ఎదురైతే.. తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ పేర్కొన్నాడు. దీనితో పాటు, సింధు నది గురించి కూడా ప్రస్తావిస్తూ.. భారతదేశం సింధు నదిపై ఆనకట్ట నిర్మించబోతోందని, ముందుగా ఆనకట్ట నిర్మించనిచ్చి, తర్వాత క్షిపణి దాడితో దానిని నాశనం చేస్తామని అన్నారు.
READ MORE: Adaso Kapessa: 1985 నుంచి ఇదే ఫస్ట్.. ఎస్‌పీజీలో తొలి మహిళా ఆఫీసర్..!