Stranger Helps: ఓ వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో రాఖీ సమయంలో పరిచయం లేని ఓ మహిళ ద్వారా తనకు ఏ విధంగా సాయం అందిందో పంచుకున్నాడు. తాను పూర్తిగా ధైర్యం కోల్పోయినప్పుడు, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తను నా దగ్గర వచ్చి సాయం చేసిందని తెలిపారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందని కామెంట్లు పెడుతున్నారు. అసలు ఏంటా కథ.. ఆమె చేసిన సాయం ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ MORE: AI replacing Keyboard and Mouse: ఐదేళ్ల తర్వాత మౌస్-కీబోర్డ్ అవసరమే ఉండదట.. మైక్రోసాఫ్ట్ సంచలనం
ధైర్యం కోల్పోయినప్పుడు వచ్చింది తను…
అద్దె, రుణ వాయిదాలు చెల్లించడానికి డబ్బు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు తను సహాయం పొందాలనే ఆశతో రెడ్డిట్‌లో పోస్ట్ చేసినట్లు తెలిపాడు. ఆ తర్వాత ఒక అద్భుతం జరిగిందని, ఎవరో ఒక అపరిచితుడు వచ్చి తనకు సహాయం చేస్తాడని నిజంగా తనకు తెలియదని అన్నాడు. కానీ ఆ అపరిచిత వ్యక్తి చేసిన సాయాన్ని వినియోగించుకోడానికి ఆ టైంలో తనకి పేపాల్ ఖాతా పనిచేయలేదన్నాడు. దీంతో తాను మళ్లీ రెడ్డిట్‌లో ఒక పోస్ట్ చేసినట్లు పేర్కొ్న్నాడు. పేపాల్, యుపిఐ ఖాతా పనిచేస్తున్న వారి నుంచి సాయం కోరినట్లు తెలిపారు. అతని అంచనాలకు మించి, పరిచయం తెలియని వ్యక్తి వెంటనే అతనికి రూ. 2,800 సహాయం చేయడానికి ముందుకొచ్చిందన్నాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ స్పందన చూసి ఆశ్చర్యపోయినట్లు పేర్కొ్న్నాడు. రాఖీ సమయంలో ఆ పరిచయం లేని మహిళ తనకు రూ.2,800 సాయం చేసిందని తెలిపారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ డబ్బులను తాను తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె నవ్వి.. ఈ డబ్బును ఒక అక్క మీకు ఇచ్చిన రాఖీ బహుమతిగా ఇచ్చిందని భావించి తీసుకోవాలని చెప్పినట్లు పేర్కొన్నాడు.
ఈరోజుల్లో భూమిపై నుంచి మానవత్వం అదృశ్యమైనప్పటికీ, కొంతమంది ఇప్పటికీ తమలో తాము మానవత్వాన్ని కాపాడుకుంటున్నారని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. తాను పూర్తిగా ధైర్యం కోల్పోయినప్పుడు, అద్దె, రుణ వాయిదాలు చెల్లించడానికి డబ్బు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు తను నా దగ్గర వచ్చి సాయం చేయడాన్ని మర్చిపోలేనని పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ పోస్ట్‌ను @xo_aum రెడ్డిట్‌లో షేర్ చేశారు.
READ MORE: WAR 2 Pre Release Event : ఎన్టీఆర్ నాకు తమ్ముడు.. సింగిల్ టేక్ యాక్టర్.. హృతిక్ ప్రశంసలు