70mm Entertainments: ఆరు స్క్రిప్టులు లాక్.. .. రెండేళ్లలో సినిమాలు రిలీజ్ చేస్తామన్న నిర్మాణ సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
70mm Entertainments: ప్రముఖ నిర్మాణ సంస్థ 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆరు కొత్త సినిమాల స్క్రిప్టులు లాక్ చేస్తూ ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించింది. వచ్చే రెండేళ్లలో ఈ ఆరు సినిమాలను వరుసగా తెరకెక్కించి విడుదల చేయబోతుంది. వేర్వేరు జానర్స్‌లో క్వాలిటీ స్టోరీటెల్లింగ్‌కి ప్రాధాన్యం ఇస్తూ ప్రేక్షకుల్ని అలరించేలా కొత్త సినిమాలను ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాతలు విజయ్‌చిల్లా, శశిదేవిరెడ్డి తెలిపారు.
ట్రాక్ రికార్డ్ ఇదే..
70mm ఎంటర్‌టైన్‌మెంట్స్‌ను విజయ్‌చిల్లా, శశిదేవిరెడ్డి స్థాపించారు. ఇప్పటివరకు క్రిటిక్స్, ప్రేక్షకుల ప్రసంశలు పొందిన ఎన్నో హిట్ సినిమాలను ఈ నిర్మాణ సంస్థ అందించింది. ఈ నిర్మాణ సంస్థ నుంచి 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భలే మంచిరోజు (సుధీర్ బాబు, వామికా గబ్బి) స్టైలిష్ యాక్షన్ కామెడీ, కల్ట్ హిట్‌గా నిలిచింది. 2017 లో వచ్చిన ఆనందో బ్రహ్మ (తాప్సీ పన్ను, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్) హారర్ కామెడీని రీడిఫైన్ చేసింది. 2019లో వచ్చిన యాత్ర (మమ్ముట్టి) భావోద్వేగాలతో నిండిన పొలిటికల్ బయోపిక్, ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. 2021లో రిలీజ్ అయిన శ్రీదేవి సోడా సెంటర్ (సుధీర్ బాబు, ఆనంది) సోషల్ మెసేజ్‌తో కూడిన విజువల్‌గా, రిచ్ డ్రామాగా నిలిచింది. నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ.. తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే ప్రతి సినిమా థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ఉంటుందని, క్వాలిటీ కంటెంట్‌కే ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ ప్రాజెక్టులను అద్భుతమైన నిర్మాణ విలువలతో ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చిత్రీకరించనున్నట్లు వెల్లడించారు. సినిమాల డైరెక్టర్లు, హీరోల వివరాలు త్వరలో ప్రకటిస్తామన్నారు.
Also Read
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
తాజావార్తలు
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!