cop arrested: బైక్ దొంగతనం కేసులో ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తీరా చూస్తే ఆయనో పోలీసు కానిస్టేబుల్ అని బయటపడింది. ఏంటీ స్టోరీ అని పోలీసులు వారి తీరులో అరెస్ట్ చేసిన వ్యక్తిని ఎంక్వైరీ చేస్తే అసలు నిజాలు బయటికి వచ్చాయి. అసలు ఆ వ్యక్తి నిజంగానే పోలీసో కాదో, ఆయనకు దొంగతనాలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ MORE: HYDRA: ఉద్యోగుల జీతాలపై స్పష్టత.. హైడ్రా కమిషనర్ భరోసా!
సెలవుపై వచ్చి బైక్‌లతో వెళ్లే వాడు..
రాజధాని ఎన్‌క్లేవ్ సమీపంలో ఢిల్లీ ప్రీత్ విహార్ పోలీసులు ఒక వ్యక్తిని బండి దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ అరెస్ట్ అయిన వ్యక్తి కూడా పోలీస్ కావడం. ఆయన ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పని చేసే వ్యక్తి. సెలవుల్లో ఇలా వచ్చి అలా బండ్లు దొంగతనం చేసుకొని వెళ్లిపోవడం ఆయన అలవాటని ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిందితుడి పేరు మొహ్సిన్. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇప్పటికే నిందితుడి అరెస్ట్ విషయం యూపీ పోలీసులకు చేరవేసినట్లు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
నిందితుడు మొహ్సిన్ యూపీలోని బాగ్‌పత్ జిల్లాలోని బరౌత్ మండలం డోఘాట్ గ్రామ నివాసి. ప్రస్తుతం ఆయన మీరట్‌లోని 44వ PACలో విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు అతని నుంచి రెండు బైక్ కీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటితోనే ఆయన బైక్ దొంగతనాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో నిందితుడు జూదానికి బానిసయ్యాడని తేలింది. ఆయన అప్పుల్లో కూరుకుపోయిన అతను వాటిని తీర్చడానికి దొంగతనాలు స్టార్ట్ చేశాడని చెప్పారు. గతంలో నిందితుడు ప్రీత్ విహార్ నుంచి ఒక మోటార్ సైకిల్‌ను దొంగిలించాడని, ఇప్పుడు కూడా సెలవుల్లో బైక్‌లను చోరీ చేయడానికి వచ్చి తమకు దొరికినట్లు వెల్లడించారు. గతంలో ప్రీత్ విహార్ నుంచి దొంగిలించిన బైక్‌ను మీరట్‌లోని వీర్‌నాగాలాలో ఒక యువకుడికి అమ్మినట్లు నిందితుడు చెప్పాడు. దొంగిలించిన బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
READ MORE: Tollywood : తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రితో దిల్ రాజు భేటీ