Elumalai Movie: హీరోయిన్ రక్షిత సోదరుడు రాన్నా హీరోగా, ప్రియాంక ఆచార్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘ఏలుమలై’. నరసింహా నాయక్ (రాజు గౌడ) సమర్పణలో తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్ బ్యానర్లపై యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి రచన, మాటలు, దర్శకత్వం పునీత్ రంగస్వామి వహించారు. తాజాగా ఈ చిత్రం నుంచి సింగర్ మంగ్లీ పాడిన ‘కాపాడు దేవా’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, డి. ఇమ్మాన్ బాణీ కంపోజ్ చేశారు. పాట లిరిక్స్‌ను గమనిస్తే.. ఓ ప్రేమ జంట, విడిపోయే క్షణాలు, ఆ దేవుడు ఆడే ఆటని చూపించినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే సిధ్ శ్రీరామ్ ఆలపించిన ‘రా చిలకా’ అనే పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే.
READ MORE: WAR 2 Pre Release Event : వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఇక్కడ చూడండి
త్వరలో రిలీజ్ డేట్..
కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర్, సేలం, ఈరోడ్ వంటి వివిధ ప్రదేశాలలో ఈ మూవీని చిత్రీకరించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ భాషలలో ఏకకాలంలో విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. సినిమాలో రాన్నా, ప్రియాంక ఆచార్, జగపతి బాబు, నాగభరణ, కిషోర్ కుమార్, సర్దార్ సత్య, జగప్ప తదితరులు నటించారు.
READ MORE: 70mm Entertainments: ఆరు స్క్రిప్టులు లాక్.. .. రెండేళ్లలో సినిమాలు రిలీజ్ చేస్తామన్న నిర్మాణ సంస్థ