వర్షాకాలంలో పాములు బయటకు రావడం సర్వసాధారణం. వర్షపు చుక్కలు భూమిపై పడగానే.. భూమి లోపల దాగి ఉన్న అనేక జీవులు బయటకు వస్తాయి. వర్షం పడగానే ఎక్కువగా పాములను మనం చూస్తాం. పొలాలు, పశువుల షెడ్స్, రోడ్లు, వీధులతో సహా కొన్నిసార్లు ఇళ్లలో పాములు ఉండటం చూసి ప్రజలు భయపడతారు. తెలియకుండా వాటిపై అడుగు వేస్తే అవి కాటేస్తాయి. పాములలో కొన్ని విషపూరితమైనవి ఉండగా.. మరికొన్ని విషరహితమైనవి కూడా ఉన్నాయి.
ప్రతి పాము విషపూరితమైనదని, అది కరిస్తే మరణం ఖాయం అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా తప్పు. భారతదేశంలో కనిపించే దాదాపు 80 శాతం పాములకు విషం ఉండదు. అవి మానవులకు పెద్దగా హాని కలిగించవు. పర్యావరణాన్నీ కాపాడంలో అవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ పాములు చాలా వరకు ఎలుకలు, కీటకాలు, పంటలకు హాని కలిగించే ఇతర జీవులను తింటాయి. తద్వారా రైతు దిగుబడి పెరుగుతుంది. పాములను చంపడం వల్ల జీవవైవిధ్యానికి హాని జరగడమే కాకుండా.. అనుకోకుండా ఇబ్బందుల్లో పడవచ్చు.
చెకర్డ్ కీల్‌బ్యాక్ (నీటి పాము):
ఈ పాము చెరువులు, కాలువలు, పొలాల దగ్గర కనిపిస్తుంది. ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దానిపై ఒంటిపై చారలు ఉంటాయి. ఇది నీటిలో చేపలను వేటాడి తింటూ మానవులకు దూరంగా ఉంటుంది.
ఎలుక పాము (ధమన్):
భారతదేశంలోనే అతి పొడవైన విషం లేని పాము ఇది. పొలాల్లో కనిపించే ఎలుకలకు ఇది అతిపెద్ద శత్రువు అని చెప్పొచ్చు. ఇది చాలా వేగంగా పాకుతుంది కానీ హాని కలిగించదు.
Also Read: Flipkart Pre-Reserve Pass: ఫ్లిప్‌కార్ట్ ప్రీ పాస్ కొనండి.. డెడ్ చీప్‌గా ‘ఐఫోన్ 16 ప్రో’ను పొందండి!
సాండ్ బోవా (రెండు తలల పాము):
దీని తల, తోక ఒకేలా కనిపిస్తాయి. అందుకే ప్రజలు గందరగోళానికి గురవుతారు. దీనిని రెండు తలల పాము అని అంటారు. ఇది భూగర్భంలో నివసించే పూర్తిగా సురక్షితమైన పాము.
పిల్లి పాము:
ఇది స్వల్పంగా విషపూరితమైనది కానీ మానవులకు ప్రాణాంతకం మాత్రం కాదు. ఇది సాధారణంగా రాత్రిపూట చురుకుగా ఉంటుంది. ఈ పాము చెట్లపై నివసిస్తుంది. ఇది అతి చిన్న పాము. దీనిని ఒక కీటకం అని భావించి ప్రజలు నలిపివేస్తారు. ఇది భూమి కింద నివసిస్తుంది, చాలా అమాయకమైన పాము ఇది.
తోడేలు పాము:
ఇది క్రైట్ (కట్లపాము)ను పోలి ఉంటుంది. ఇది ప్రజలను గందరగోళానికి గురి చేస్తుంది కానీ విషపూరితమైనది కాదు. ఈ పామును అక్రమ వ్యాపారంకు ఉపయోగిస్తారు.
మీకు పాము కనిపిస్తే.. చంపడానికి బదులుగా అటవీ శాఖకు లేదా స్థానిక స్నేక్ క్యాచర్‌కు కాల్ చేయండి. భారతదేశ వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం పాములను చంపడం చట్టవిరుద్ధం. ప్రతి పాము ప్రాణాంతకం కాదని, మీ చుట్టూ ఉన్న వీలైనంత ఎక్కువ మందికి చెప్పండి. పామును చంపే ముందు అది విషపూరితమైనదా? లేదా మీ పంటలను కాపాడుతుందా? లేదా ప్రకృతి సమతుల్యతను కాపాడుతుందా? అని ఓసారి ఆలోచించండి.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన ఆర్టికల్ కేవలం సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ntvtelugu.com దీన్ని ధృవీకరించలేదు.)