కోవిడ్ మహమ్మారి అనంతరం ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. చాలా మంది మంచి ఆహరం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కూరగాయలు, మాంసంతో పాటుగా పండ్లను కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యం కోరుకున్నట్లతే.. మీ ఇంటి గార్డెన్‌లో ఈ 5 పండ్ల చెట్లను నాటుకుంటే సరిపోతుంది. నాటిన చెట్లు కాస్త పెద్దయ్యాక మీరు పండ్లు కొనడానికి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీరు గార్డెన్‌లోనే తాజా పండ్లను కోసుకోవచ్చు. దాంతో ఆరోగ్యంతో పాటు డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు.
బత్తాయి:
మన ఇంటి గార్డెన్‌లో పెరగడానికి బత్తాయి చెట్టు అత్యంత అనుకూలమైది. చాలా త్వరగా పెరగడమే కాకుండా.. ఎక్కువ మొత్తంలో పండ్లు లభిస్తాయి. బత్తాయి రసం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. జనాలు బత్తాయిని మార్కెట్లో కొంటారు. వాటిపై ఎక్కువ రసాయనాలు చల్లుతారు. ఇంట్లో పెరిగిన చెట్టుకు ఆ సమస్య ఉండదు.
జామ:
జామ చెట్టును ఇంటి తోటలో సులభంగా పెంచుకోవచ్చు. ఈ పండు జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. ఇంటి దగ్గర తక్కువ స్థలంలో సులభంగా పెంచుకోవచ్చు. ఇది తక్కువ వనరులతో మంచి దిగుబడిని ఇస్తుంది. షుగర్ పేషేంట్స్ ఎక్కువగా జామ కాయలను తింటారన్న విషయం తెలిసిందే.
బొప్పాయి:
కడుపుకు దివ్యౌషధం అయిన బొప్పాయిని కేవలం మూడు అడుగుల భూమిలోనే నాటవచ్చు. తోటలో నాటడానికి ఇది ప్రత్యేకమైన పండ్లలో అనువైనదిగా పరిగణించబడుతుంది. బొప్పాయిని పచ్చిగా, పండిన రెండింటినీ ఉపయోగించవచ్చు. బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Also Read: Shahid vs Shaheen: అల్లుడు.. నీ పరుగులు ఏం వద్దు!
మామిడి:
ఇంటి తోటలో చాలా తక్కువ స్థలంలో సులభంగా పెంచగలిగే మామిడి రకాలు చాలా ఉన్నాయి. పండ్లలో రారాజు మామిడి అని అందరికీ తెలిసిందే. మార్కెట్లో దొరికే నకిలీ మామిడి పండ్లకు బదులుగా.. మీరు తోటలో పండించిన స్వచ్ఛమైన మామిడి పండ్లను ఆస్వాదించవచ్చు.
అరటి:
అరటిని తోటలో నాటడానికి అనువైనదిగా భావిస్తారు. అరటికి కూడా ఎక్కువ భూమి అవసరం లేదు. ఈ పండు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మీరు దీన్ని తోటలో సులభంగా నాటవచ్చు.