మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు. తెలంగాణలో ఒక ట్రంప్ ఉండేవారని, తెలంగాణ ప్రజలు ఆ ట్రంప్‌ను పక్కన పడేశారని ఎద్దేవా చేశారు. ఇష్టరాజ్యంగా పరిపాలన నడిపించే వారు ఎవరైనా ట్రంప్ అవుతారు అని పేర్కొన్నారు. రాత్రి నిద్రలో ఏదైనా ఆలోచన వస్తే.. మరుసటి రోజు ఆర్డర్ ఇవ్వడం చాలా రోజులు నడవదు అని సీఎం విమర్శించారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన […]
ఇటీవలి రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు వరుసగా రెండు రోజులు తగ్గాయి. పెరుగుదలలో చిన్న బ్రేక్ ఇచ్చిన పసిడి ధరలు.. మరలా పెరుగుదల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై రూ.160 పెరిగింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం (సెప్టెంబర్ 19) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,02,050గా.. 24 క్యారెట్ల ధర రూ.1,11,330గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 […]
ఆసియా కప్ 2025లో ఆడుతున్న శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగేకు చేదువార్త అందింది. దునిత్ తండ్రి సురంగా వెల్లలాగే గుండెపోటుతో మృతి చెందారు. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే శ్రీలంక మేనేజ్మెంట్కు విషయం తెలిసింది. అయితే మ్యాచ్ పూర్తయిన తరవాత దునిత్‌కు విషయం చెప్పారు. దాంతో అతడు మైదానంలో బోరున విలపించాడు. శ్రీలంక కోచ్ సనత్ జయసూర్య మైదానంలో దునిత్‌కు ఈ విషాదకరమైన వార్తను చెప్పి.. బయటకు తీసుకొస్తున్న వీడియో […]
హైదరాబాద్ నగరంలోని కోకాపేట్లో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య కూరగాయాల కత్తితో రప్పా రప్పా పొడిచి హత్య చేసింది. దంపతుల మధ్య చిన్న గొడవ జరిగి.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈక్రమంలో విచక్షణ కోల్పోయిన భార్య కత్తితో భర్తపై అతికిరాతంగా దాడి చేసింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన భార్త.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యను అరెస్ట్ చేశారు. Also Read: iPhone 17: ఈ క్రేజ్ ఏంట్రా […]
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం ‘యాపిల్’ ఇటీవల ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్‌లతో పాటు ఐఫోన్ 17 ఎయిర్‌ను లాంచ్ చేసింది. ఇక భారత టెక్ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ఈ రోజు ఉదయం నుంచి 17 సిరీస్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ లవర్స్ యాపిల్ స్టోర్ల ముందు భారీగా బారులు […]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టుల హెచ్చరిక లేఖ కలకలం సృష్టిస్తోంది. చర్లలో భూస్వాములు, రాజకీయ నాయకులు పద్ధతి మార్చుకోవాలని, లేదంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిస్తూ మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరిట లేఖ విడుదల అయింది. లేఖ రిలీజ్ కావడంతో మండలంలోని భూస్వాముల్లో, అధికార పార్టీ నాయకుల్లో గుబులు మొదలైంది. పరుచూరి ప్రేమ్‌చంద్, పరుచూరి రవికుమార్, జవ్వాది రవికుమార్, […]
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులుల దాడులు దడ పుట్టిస్తున్నాయి. ఒకే రోజు వేర్వేరు చోట్ల ముగ్గురిపై దాడి చేశాయి. పులుల దాడులలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ, ఓ పురుషుడు ఉన్నాడు. మరో బాలుడిని అటవీ ప్రాంతంలోకి చిరుత లాక్కెళ్ళింది. బాలుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. ఈ మూడు ఘటనలతో చంద్రపూర్ జిల్లా ఉలిక్కిపడింది. చంద్రపూర్ జిల్లా చిమూర్ తాలూకాలోని మౌజా లావరీ గ్రామానికి చెందిన మహిళ విద్యా కైలాస్ మస్రామ్ […]
ఆసియా కప్ 2025 గ్రూప్ స్టేజ్‌లో భాగంగా సెప్టెంబర్ 14 భారత్, పాకిస్థాన్ టీమ్స్ తలపడ్డాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో టాస్, మ్యాచ్ అనంతరం పాక్ ఆటగాళ్లతో భారత్ ప్లేయర్స్ కరచాలనం చేయలేదు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ నిబంధనలు ఉల్లంఘించాడని, టోర్నీ నుంచి అతడిని తొలగించాలని ఏసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీని తొలగించకుంటే తాము టోర్నీని బహిష్కరిస్తామని పీసీబీ ఏసీసీని హెచ్చరించింది. ఈ విషయంపై ఐసీసీని ఏసీసీ సాయం కోరింది. మ్యాచ్ రిఫరీని […]
ఆసియా కప్ 2025లో తన చివరి గ్రూప్ మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. పసికూన ఒమన్‌ను సూర్య సేన ఢీకొట్టనుంది. ఆదివారం పాకిస్థాన్‌తో సూపర్ 4 పోరు నేపథ్యంలో భారత్ ఈ మ్యాచ్‌ను ప్రాక్టీస్‌లా ఉపయోగించుకోనుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న భారత్.. యూఏఈ, పాకిస్థాన్‌లపై ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. పటిష్ట భారత్ పసికూన ఒమన్‌పై గెలవడం ఖాయం. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్ […]
నారాయణ జూనియర్ కాలేజీలకులో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థిపై ఫ్లోర్ ఇంచార్జి దాడి చేశాడు. ఈ దాడిలో విద్యార్థి దవడ ఎముక విరిగిపోయింది. విషయం తెలుసుకున్న విద్యార్థి పేరెంట్స్ మలక్ పేట పోలీసులకు పిర్యాదు చేశారు. ఫ్లోర్ ఇంచార్జి, నారాయణ కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నారాయణ జూనియర్ కాలేజీ గడ్డిఅన్నారం బ్రాంచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. Also Read: Bathukamma 2025: బతుకమ్మకు గుడి లేదు, మంత్రాలు లేవు, పూజారి ఉండడు.. బాట […]