బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రానున్న మూడు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అంతేకాదు పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్ల క్రింద ఉండకూడని, ఇంట్లోనే సురక్షితంగా ఉండండని ప్రజలకు సూచించారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 9 వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
Also Read: YS Jagan: అక్టోబరు 10 నుంచి రచ్చబండ కార్యక్రమం.. కోటి సంతకాలను సేకరిస్తాం!
రెడ్ అలెర్ట్:
విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఆరెంజ్ అలెర్ట్:
శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, నెల్లూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు
ఎల్లో అలెర్ట్:
పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు