తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ‘మార్వాడి గో బ్యాక్’ జేఏసీ రాష్ట్ర కమిటీ ఏర్పడింది. మార్వాడి గో బ్యాక్ జేఏసీ చైర్మన్గా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఎన్నికయ్యారు. పిడమర్తి రవిని 11 సంఘాల నాయకులు కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ… మార్వాడీలకు హెచ్చరికలు జారీ చేశారు. కొత్తగా షాపులు ఏర్పాటు చేస్తే భౌతిక దాడులే అని […]
హైదరాబాద్ నగరం రాయదుర్గంలోని భూమికి ఆల్ టైమ్ రికార్డు ధర దక్కింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం ధర ఏకంగా రూ.177 కోట్లు పలికింది. రాయదుర్గం ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని టీజీఐఐసీ, జేఎల్ఎల్ ఇండియా అండ్ ఎంఎస్టీసీ భాగస్వామిగా వేలం నిర్వహించారు. రాయదుర్గంలోని 7.67 ఎకరాలకు వేలం నిర్వహించగా.. మొత్తం రూ.1357.59 కోట్లు ప్రభుత్వంకు దక్కింది. వేలంలో పాల్గొన్న ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ అత్యధిక ధరతో 7.6 ఎకరాల భూమిని సొంతం చేసుకుంది. వేలంలో ఇది […]
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కు ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం తమకు పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. జూబ్లీహిల్స్లో విజయం తమదే అని పీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈరోజు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న ఉప ఎన్నిక పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు ఈసీ వెల్లడించింది. మాగంటి […]
‘లక్కీ డ్రా’ అంటే.. మధ్యతరగతి జనాలకు ఎక్కడ లేని ఆశ పుట్టుకొస్తుంది. లక్కీ డ్రాలో ఫ్రీగా బైక్, కార్, ఏసీ, బంగారం, నగదు, ప్రాపర్టీలు గెలుపొందచ్చన్న ఆశతో చాలామంది స్కీమ్లు వేస్తుంటారు. లక్కీ డ్రాలలో కొన్ని నిజమైనవే ఉండగా.. మరికొన్ని మోసాలు కూడా ఉంటాయి. ఈజీ మనీకి అలవాటు పడ్డ జనాలు ఇవేమీ పట్టించుకోవడం లేదు. అందుకే కొత్త కొత్త లక్కీ డ్రాలు వేస్తుంటారు. తాజాగా తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ప్రస్తుతం ఓ లక్కీ […]
గతంలో హైదరాబాద్ వంటకాలు అంటేనే లొట్టలేసుకుని తిన్న జనాలు.. ఇప్పుడు మాత్రం జడుసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా వరుసగా జరుగుతున్న సంఘటనలే ఇందుకు కారణం. నగరంలో నిత్యం ఎదో చోట హోటల్ లేదా రెస్టారెంట్లలో బిర్యానీలో బొద్దింక, సాంబార్లో బల్లి, చట్నీలో ఈగ పడిన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. హోటల్/రెస్టారెంట్ యాజమాన్యాలు మాత్రం మారడం లేదు. తాజాగా ఫేమస్ రెస్టారెంట్ కృతుంగలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. Also […]
తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం తెలిపింది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. జూబ్లీహిల్స్ పరిధిలో మొత్తంగా 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. Also Read: Harish Rao: రేవంత్ చీఫ్ మినిష్టర్ కాదు, కటింగ్ […]
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ చీఫ్ మినిస్టర్ కాదు అని, కటింగ్ మాస్టర్ అని ఎద్దేవా చేశారు. రేవంత్ జేబులో కత్తెర పెట్టుకొని మాజీ సీఎం కేసీఆర్ చేసిన పనులకు రిబ్బన్ కట్ చేస్తున్నాడని విమర్శించారు. రిబ్బన్ కత్తిరించడం లేదంటే కేసీఆర్ ఇచ్చిన పథకాలు కట్ చేయడమే రేవంత్ పని అని పేర్కొన్నారు. కాళేశ్వరం కూలిందని చెబుతున్న సీఎం రేవంత్.. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్ నగరంకి […]
మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మిస్టర్ హరీష్ రావు.. మీలాగా మాటలు కాదు, చేతల ప్రభుత్వం మాది అని విమర్శించారు. విద్యా, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నాం అని, శంకుస్థాపన స్థాయిలో వదిలి వెళ్లిపోయిన హాస్పిటల్స్ ఈ 21 నెలల్లో వేగంగా నిర్మిస్తున్నాం అని అన్నారు. మీ ప్రభుత్వం 40 వేల కోట్ల బకాయి పెట్టిపోతే.. తాము చెల్లిస్తున్నాంఅని మండిపడ్డారు. నిత్యం మా ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష […]
తెలంగాణ మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలో పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలిలిల్లీ కంపెనీ దేశంలోనే మొదటి సారిగా తమ మాన్యుఫాక్షరింగ్ యూనిట్ను హైదరాబాద్లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ యూనిట్ ఏర్పాటుకు ఒక బిలియన్ డాలర్ల (సుమారు రూ.9000 కోట్లు) భారీ పెట్టుబడులకు కంపెనీ ముందుకొచ్చింది. దీంతో ఎలిలిల్లీ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా తమ ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని విస్తరించనుంది. సోమవారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎలిలిల్లీ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని […]
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ విజయం దిశగా దూసుకెళుతోంది. ఆసియా కప్ 2025లో పురుషుల జట్టు మాదిరే.. ఈ మ్యాచ్లోనూ మహిళలు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ముందుగా బ్యాటింగ్లో చెలరేగిన భారత మహిళలు.. బౌలింగ్లో కూడా సత్తాచాటుతున్నారు. టీమిండియా బౌలర్ల దెబ్బకు పాక్ ఐదు కీలక వికెట్స్ కోల్పోయి పరాజయం దిశగా సాగుతోంది. పాక్ 31 ఓవర్లలో 5 వికెట్స్ కోల్పోయి […]