భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో స్టైల్, పవర్ అండ్ ఆఫ్-రోడింగ్‌కు ప్రసిద్ధి చెందిన కారు ఏదంటే.. అందరూ ‘మహీంద్రా థార్’ అన్ని టక్కున చెప్పేస్తారు. థార్ రెండవ తరం మోడల్ దాదాపు ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది. ఈరోజు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘థార్ 3 డోర్’ 2025 మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ కారు ఇప్పటికే భారతదేశం అంతటా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కొత్త ఫేస్‌లిఫ్టెడ్ థార్ 3 […]
మరో ఫ్రెంచ్ ఫ్లేవర్ భారతీయ ఎస్యూవీ మార్కెట్లోకి ప్రవేశించింది. సిట్రోయెన్ ఇండియా తన కొత్త ఎస్యూవీ ‘ఎయిర్‌క్రాస్ ఎక్స్’ని విడుదల చేసింది. ఆకర్షణీయమైన లుక్స్, శక్తివంతమైన ఇంజిన్‌తో కూడిన ఈ ఎస్యూవీ ప్రారంభ ధర రూ.8.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. సిట్రోయెన్ 2.0 ‘షిఫ్ట్ ఇన్ ది న్యూ’లో ఇది మూడవ మోడల్. ఇంతకుముందు సిట్రోయెన్ సి3 ఎక్స్, బసాల్ట్ ఎక్స్‌లను రిలీజ్ చేసింది. ఎక్స్ పేరుతో కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీకి మరిన్ని ఫీచర్లు, […]
ప్రముఖ ఈ-కామర్స్ (ఆన్లైన్) షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ ముగిసింది. మీరు ఈ ఆఫర్స్ మిస్ అయితే ఎలాంటి చింత అవసరం లేదు. ఫ్లిప్‌కార్ట్ మీకు మరో అవకాశాన్ని అందిస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో కొత్త సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ అక్టోబర్ 4న ప్రారంభమైంది. ఈ సేల్‌ను సద్వినియోగం చేసుకుని మీరు స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వస్తువులను […]
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా దాయాదులు భారత్, పాకిస్తాన్ జట్లు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ ప్రక్రియ వివాదంకు తెరలేపింది. మ్యాచ్‌లో టాస్ సందర్భంగా రిఫరీ సహా వ్యాఖ్యాత పెద్ద తప్పిదం చేశారు. తప్పిదాన్ని సద్వినియోగం చేసుకున్న పాక్ కెప్టెన్ ఫాతిమా సనా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ రిఫరీ నిర్ణయం వెనుక పెద్ద కుట్ర ఉందని ఫాన్స్ మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి […]
2025 ఇరానీ కప్‌ను విదర్భ గెలుచుకుంది. రెస్ట్ ఆఫ్ ఇండియాను 93 పరుగుల తేడాతో ఓడించిన విదర్భ మూడో ఇరానీ కప్‌ను కైవసం చేసుకుంది. 361 పరుగుల లక్ష్య ఛేదనలో రెస్టాఫ్ ఇండియా 267 పరుగులకు ఆలౌటైంది. యశ్ ధుల్ (92), మానవ్ సుతార్ (56) హాఫ్ సెంచరీలు చేశారు. విదర్భ బౌలర్ హర్ష్ దూబె ఐదు వికెట్స్ (5/73)తో చెలరేగాడు. 2018, 2019లోనూ విదర్భ ఇరానీ కప్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ […]
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘శాంసంగ్’ బడ్జెట్ శ్రేణిలో మూడు స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. భారతదేశంలో Galaxy A07, Galaxy F07, Galaxy M07 4Gలను విడుదల చేసింది. ఈ ఫోన్లన్నీ దాదాపుగా ఒకే ఫీచర్స్ కలిగి ఉన్నాయి. మూడు స్మార్ట్ఫోన్ల పేర్లు, కలర్స్, ధరలలో మాత్రమే తేడాలు ఉన్నాయి. ఈ మూడు ఫోన్స్ వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి. మూడు స్మార్ట్ఫోన్లు 6.7 అంగుళాల హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లేను కలిగి ఉన్నాయి. మీడియాటెక్ […]
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగొంచి.. శుభ్‌మన్ గిల్‌ను సారథిగా ఎంపిక చేశారు. బీసీసీఐ నిర్ణయం క్రికెట్ ప్రపంచంను ఆశ్చర్యంకు గురిచేసింది. సెలెక్టర్ల ఈ నిర్ణయంపై రోహిత్ అభిమానులు మండిపడుతున్నారు. ఎందుకంటే రోహిత్ కెప్టెన్సీలో కొన్ని నెలల క్రితం ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత్ గెలుచుకుంది. ఫైనల్లో హిట్‌మ్యాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా కూడా ఎంపికయ్యాడు. ప్రస్తుతం రోహిత్ పేరు ట్రెండింగ్‌లో ఉంది. […]
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇటీవల ముగిసిన పురుషుల ఆసియా కప్ 2025లో ‘నో హ్యాండ్‌షేక్’ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌లు జరిగినా భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్స్‌కు కరచాలనం ఇవ్వలేదు. అంతేకాదు ఆసియా కప్ గెలిచినా పీసీబీ చీఫ్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి టీమిండియా నిరాకరించింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో కూడా నో హ్యాండ్‌షేక్ కొనసాగుతోంది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా కొలంబోలోని […]
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఏ విషయంలో అయినా ఓ ఎమ్మెల్యేగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే అని, నువ్ ఏం ఇక్కడ మైసూర్ మహారాణివి కాదు అని మండిపడ్డారు. పోలీసులను అడగడానికి వెళ్లిన ప్రజలపై ఎందుకు కేసులు పెట్టావ్ అని ప్రశ్నించారు. హామీల అమలపై ప్రశ్నించిన జనాలకు చెప్పులు చూపిస్తావా?, ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని ప్రతిపక్ష నేతగా అడిగితే చెప్పు తెగుద్ది అంటావా? అని […]
ఐపీఎల్లో సత్తాచాటిన ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్.. భారత జట్టులోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. వరుసగా మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్ తరఫున రాణించిన సూర్య.. 2021లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆపై రోహిత్ శర్మ సారథ్యంలో తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇటీవల ఆసియా కప్ 2025లో భారత జట్టును విజేతగా నిలిపిన సూర్య.. ఓ ఆసక్తికర విషయం పంచుకున్నాడు. ఇక తన కోరిక […]