గురజాలలో పోటీ చేసే హక్కు నాకు ఉంది: గురజాలలో పోటీ చేసే హక్కు తనకు ఉందని , అందుకే అధిష్టానాన్ని సీటు కోరుతున్నానని ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి అన్నారు. ‘గతంలో రెండు సార్లు నేను అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాను. 2019లో కూడా పార్టీ అవసరాల మేరకే సీటు త్యాగం చేశాను. అయినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ నన్ను అనేక అవమానాలకు గురి చేశాడు. ఎమ్మెల్యే ఓ వర్గం వాళ్ళకి మేలు జరిగేలా వ్యవహరిస్తున్నారు. ఎందుకు […]
Avesh Khan replaces Mohammed Shami in India squad for IND vs SA 2nd Test: జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు భారత జట్టులో బీసీసీఐ మార్పు చేసింది. సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ స్థానంలో అవేశ్ ఖాన్‌ను తీసుకుంది. తొలి టెస్టులో షమీ ఆడలేదు. అయితే ముందుగా రెండో టెస్టుకు అతన్ని ఎంపిక చేశారు. అయితే చీలమండ గాయం కారణంగా షమీ ఇంకా జట్టుతో కలవలేదు. […]
Guntur Kaaram Song Kurchi Madathapetti Promo Out: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న తాజా సినిమా ‘గుంటూరు కారం’. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా.. యువ హీరోయిన్ శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది. గుంటూరు కారం సినిమా 2024 జనవరి 12న […]
Virat Kohli Achieves a World Record in 146 Years: టీమిండియా మాజీ కెప్టెన్, ‘కింగ్’ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వేర్వేరు క్యాలెండర్ ఇయర్లో అత్యధికసార్లు 2000 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. విరాట్ ఇప్పటివరకు ఏడు క్యాలెండర్ ఇయర్లలో 2000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెంచూరియన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ 76 పరుగులు చేసి ఈ ఘనతను అందుకున్నాడు. 146 ఏళ్లలో దిగ్గజాలకు […]
కాకినాడలో పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో రెండో రోజు పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ అమలాపురం పార్లమెంట్ కు చెందిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కో- ఆర్డినేటర్లతో ఆయన మాట్లాడనున్నారు. కాకినాడ సిటీ నుంచి పోటీ చేయాలని పవన్ ను పలువురు నేతలు కోరుతున్నారు. పార్టీలో చర్చించి అవకాశాలను బట్టి పరిశీలిద్దామని జనసేనాని చీఫ్ చెప్పారు. గతంలో వారాహి యాత్ర సందర్భంగా జరిగిన సవాళ్ళలలో దమ్ముంటే […]
Temba Bavuma Ruled Out Of IND vs SA Second Test: సెంచూరియన్ వేదికగా టీమిండియాతో గురువారం ముగిసిన మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. రోహిత్ సేనను ఏకంగా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడించింది. అద్భుత విజయం సాధించి జోష్‌లో ఉన్న దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. కేప్‌టౌన్ వేదికగా భారత్‌తో జరగనున్న రెండో టెస్టుకు ప్రొటీస్ కెప్టెన్ టెంబా బావుమా దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న […]
Rohit Sharma React on India Deeat vs South Africa in 1st Test: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తమ బ్యాటింగ్ చెత్తగా సాగిందని, బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే తొలి టెస్టులో పరాజయం పాలైనట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. తమ బౌలింగ్ పేలవంగా ఉందని, జస్ప్రీత్ బుమ్రాపైనే ఆధారపడితే పని జరగదన్నారు. కఠినమైన పిచ్‌లపై ఎలా ఆడాలో లోకేష్ రాహుల్ చూపించాడన్నాడు. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఏకంగా ఇన్నింగ్స్ […]
నేడు వ్యూహం సినిమాపై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. వ్యూహం సినిమాపై ఏపీ హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. సోనియా, కాంగ్రెస్ పరువుకు భంగం కలిగించేలా సినిమాను చిత్రీకరించాలని పిటిషనర్ పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ను పునఃపరిశీలించాలని కోరారు. నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమవరంలో పర్యటించనున్నారు. ‘విద్యా దీవెన’కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి నేడు మలివిడత సీఎం జగన్‌తో […]
South Africa Beat India in 1st Test: సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోరపరాభవం ఎదుర్కొంది. ఏకంగా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మూడో రోజైన గురువారం163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన భారత్.. దక్షిణాఫ్రికా పేస్ ముందు నిలవలేకపోయింది. బర్గర్ (4/33), యాన్సెన్ (3/36), రబాడ (2/32) ధాటికి 34.1 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ (76) టాప్ స్కోరర్. […]
Delhi Bouncer Was Burnt To Death: చలికి తట్టుకోలేని ఓ వ్యక్తి ఇంట్లో బొగ్గుల కుంపటి పక్కనే నిద్రపోయి.. మంటల కారణంగా మృతి చెందాడు. ఈ విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఫతేపూర్ బెరీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఢిల్లీని చలి వణికిస్తోన్నా […]