Rohit Sharma: ఇకనైనా నోరుపారేసుకోవడం ఆపితే మంచిది.. విమర్శకులకు గట్టి కౌంటరిచ్చిన రోహిత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma on Cape Town Pitch: భారత్ పిచ్‌లపై విమర్శలు చేసే వారికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇది కూడా క్రికెట్ పిచే కదా అని, ఆడింది మ్యాచే కదా అని విమర్శించాడు. కేప్‌టౌన్‌లో ఏం జరిగిందో మ్యాచ్ రిఫరీలకు, ఐసీసీకి కనబడిందనే అనుకుంటున్నానని.. మరి దీనికేం రేటింగ్ ఇస్తారు? అని ప్రశ్నించారు. భారత్‌కు వచ్చినప్పుడు ఇదేం చెత్త అని నోరుపారేసుకోవడం ఆపితే మంచిదని రోహిత్ ఫైర్ అయ్యాడు. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా కేప్‌టౌన్ టెస్టు రికార్డుల్లోకి ఎక్కింది. ఒకటిన్నర రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది. కేప్‌టౌన్ పిచ్‌పై ప్రస్తుతం క్రికెట్ వర్గాలపై చర్చనడుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ పిచ్‌లపై విమర్శలు చేసే వారికి టీమిండియా సారథి రోహిత్ శర్మ గట్టి కౌంటరిచ్చాడు. ‘ఇది కూడా క్రికెట్ పిచే, ఆడింది మ్యాచే. మ్యాచ్ రిఫరీలకు, ఐసీసీకి ఏం జరిగిందో తెలుసనుకుంటున్నా. మరి ఈ పిచ్‌కు ఏ రేటింగ్ ఇస్తారు?. భారత్‌లో వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ కోసం తయారు చేసిన పిచ్‌పై ఓ బ్యాటర్ సెంచరీ చేశాడు. అయినా దానికి యావరేజ్ రేటింగ్ ఇస్తారు. ఐసీసీ, మ్యాచ్ రిఫరీలు తటస్థంగా ఉండాలి’ అని రోహిత్ అన్నాడు.
Also Read
Also Read: Jasprit Bumrah: నా హృదయంలో ఈ మైదానానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది!
‘కేప్‌టౌన్‌లో ఏం జరిగిందో అందరూ చూశారు. ఈ పిచ్ ఎలా ఉందో అందరికీ తెలుసు. నిజాయితీగా చెప్పాలంటే ఇలాంటి పిచ్‌లపై ఆడేందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. విదేశీ జట్లు భారత్‌కు వచ్చినప్పుడు స్పిన్ తిరిగి మూడు రోజుల్లో ముగిస్తే.. ఇవేం పిచ్‌లు, ఇదేం చెత్త అని నోరుపారేసుకోవడం ఇకనైనా ఆపితే మంచిది’ అని రోహిత్ శర్మ కౌంటర్ ఇచ్చాడు. రెండో టెస్టులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత్ కేవలం ఒకటిన్నర రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించింది. రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!