Jasprit Bumrah Takes 5 Wickets in IND vs SA 2nd Test: కేప్‌టౌన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. రెండో రోజైన గురువారం సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికాకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా షాక్ ఇచ్చాడు. మొదటి సెషన్ తొలి ఓవర్లనే ఓవర్ నైట్ బ్యాటర్ డేవిడ్ బెడింగ్‌హామ్ (11)ను ఔట్ చేశాడు. కాసేపటికే కైల్ వెర్రెయిన్నే (9)ను పెవిలియన్ చేర్చాడు. దాంతో ఆదిలోనే రెండు వికెట్స్ కోల్పోయిన ప్రొటీస్ కష్టాల్లో పడింది.
ఆదుకుంటాడనుకున్న మార్కో జాన్సెన్ (11) కూడా జస్ప్రీత్ బుమ్రా దెబ్బకు ఔట్ అయ్యాడు. 24 ఓవర్ ఐదవ బంతికి జాన్సెన్ బుమ్రాకే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక 26వ ఓవర్లో కేశవ్ మహారాజ్ (3) శ్రేయాస్ అయ్యర్ పట్టిన క్యాచ్‌కు ఔట్ అయ్యాడు. రెండోరోజు ఆదిలోనే నాలుగు వికెట్స్ తీసిన బుమ్రా.. భారత జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో బుమ్రా ఇప్పటికే ఐదు వికెట్స్ పడగొట్టాడు. మరోవైపు ముకేష్ కుమార్ కూడా అటాక్ చేస్తున్నాడు.
Also Read: T20 World Cup 2024: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అప్పుడేనా?
ప్రస్తుతం దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లకు 7 వికెట్స్ కోల్పోయి 117 పరుగులు చేసింది. ఐడెన్ మార్‌క్రమ్ (62), కగిసో రబడ (1) క్రీజ్‌లో ఉన్నారు. దక్షిణాఫ్రికా ప్రస్తుతం 19 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌ల్లో దక్షిణాఫ్రికా 55, భారత్ 153 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ రెండో రోజే ముగిసేలా కనిపిస్తోంది. తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిన విషయం తెలిసిందే.