David Warner Farewell Test: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచే వార్నర్‌కు చివరిది. చివరి టెస్ట్ మ్యాచ్‌లో వార్నర్ సెంచరీ చేసి.. ఆటకు ఘనమైన వీడ్కోలు పలకాలని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వార్నర్ భాయ్ 34 పరుగులు మాత్రమే చేశాడు. ఫేర్‌వెల్ టెస్టులో లైఫ్ వచ్చినా.. దేవ్ భాయ్ దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు.
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో రెండో రోజు ఓవర్ నైట్ స్కోరు 6-0తో ఆసీస్ బ్యాటింగ్‌కు దిగింది. అమీర్ జమాల్ వేసిన 14వ ఓవర్లో తొలి బంతి డేవిడ్ వార్నర్ బ్యాట్‌ను తాకుతూ స్లిప్స్ దిశగా దూసుకెళ్లింది. ఫస్ట్ స్లిప్‌లో ఉన్న అయూబ్ సునాయాస క్యాచ్‌ను నేలపాలు చేశాడు. దాంతో వార్నర్‌కు లైఫ్ దొరికింది. అయితే వార్నర్ దానిని సద్వినియోగించుకోలేకపోయాడు. వార్నర్‌ను పార్ట్ టైమ్ స్పిన్నర్ అఘా సల్మాన్ ఔట్ చేశాడు. 25వ ఓవర్లో వార్నర్ స్లిప్స్‌లో బాబర్ ఆజమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో వార్నర్ ఇన్నింగ్స్ ముగిసింది. 68 బంతులు ఆడిన దేవ్ భాయ్ నాలుగు బౌండరీల సాయంతో 34 పరుగులు చేశాడు.
Also Read: Sri Lanka Captain: ఎస్‌ఎల్‌సీ కీలక నిర్ణయం.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్స్!
డేవిడ్ వార్నర్ ఔట్ అయి పెవిలియన్‌కు వెళ్తుండగా.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆటగాళ్లతో పాటు అభిమానులు అతడికి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వస్తే.. వార్నర్‌కు అదే లాస్ట్ ఇన్నింగ్స్ అవుతుంది. ఒకవేళ ఆసీస్ భారీ స్కోరు చేసి.. పాక్ ముందు భారీ లక్ష్యం ఉంచి ఆ జట్టును త్వరగా ఆలౌట్ చేస్తే వార్నర్ బ్యాటింగ్ మళ్లీ చూసే అవకాశం ఉండదు. ఆసీస్ కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ వికెట్లతో చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఆసీస్ ఇప్పటికే 2-0తో టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.