వృషభ రాశి వారికి ఈరోజు అన్ని అనుకూలంగా ఉండనున్నాయి. ముఖ్యంగా ఆర్ధిక పరంగా కలిసిరానుంది. మీ ఇంటికి అనుకోకుండా డబ్బు వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. పిల్లల ఆరోగ్య విషయాల్లో శ్రద్దగా ఉండాలి. అనవసరమైన కార్యక్రమాలను తగ్గించుకోవాలి. ఈరోజు వృషభ రాశి వారికిఅనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. నేడు కనకధారా స్తోత్రంను పారాయణం చేసి మంచి ఫలితాలు పొందండి. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలను […]
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అనస్థీషియా వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విద్యార్థి నితిన్ గురువారం రాత్రి విధులకు హాజరుకాగా.. శుక్రవారం ఉదయం ఆపరేషన్ థియేటర్లో విగతజీవిగా పడి ఉన్నాడు. ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మెదక్ జిల్లాకు చెందిన గిరిజన బిడ్డ నితిన్ మృతిపై తల్లిదండ్రలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందో తెలియదు అంటూ నిమ్స్ అధికారులు విషయాన్ని గోప్యంగా ఉంచడానికి మీడియాను అన్నివిధాలుగా […]
రైతులు పత్తి అమ్ముకోవడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రైతులు తొందరపడి దళారుల చేతిలో పడొద్దని, పత్తి కొనుగోలు విషయంలో అస్సలు భయపడవద్దన్నారు. పత్తిని మొత్తం కొనుగోలు చేయాలను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ని ప్రధాని మోడీ ఆదేశించారని తెలిపారు. 12 శాతం వరకు తేమ ఉన్నా సీసీఐ పత్తిని కొంటుందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎఫ్‌సీఐ, సీసీఐపై రివ్యూ చేసిన కిషన్ రెడ్డి.. ఈరోజు మీడియాతో […]
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ఈరోజు రూ.400 కోట్లు చెల్లిస్తున్నాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా నుంచి సింగరేణి ప్రస్థానం ప్రారంభమైందని, ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు. సింగరేణికే ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భట్టి చెప్పారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు. ‘తొలిసారి సైంటిఫిక్‌గా రాష్ట్రంలో కులగణన […]
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న భర్తను భార్య హతమార్చింది. కూతురి సహాయంతో భర్త మెడకు చీర బిగించి హత్య చేసింది. ఆపై పోలీసులకు ఫోన్ చేసి తన భర్తను చంపేశానని చెప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుడి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలకు చెందిన […]
మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోయారు. ఆశన్నతో పాటు 208 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ సీఎం, హోంమంత్రి సమక్షంలో లొంగిపోయారు. మావోయిస్టులు అందరూ సీఎం విష్ణుదేవ్ సమక్షంలో ఆయుధాలను అప్పగించారు. ఆశన్న బీజాపూర్ మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడుగా పని చేశారు. లొంగుబాటు నేపథ్యంలో ఆశన్న సహచరులను ఉద్దేశించి చివరి ప్రసంగం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయుధాలను వదిలిపెడుతున్నాం అని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో ఉండలేమన్నారు. ‘ఎవరికి వారే తమ […]
కిరణ్ అబ్బవరం హీరోగా కొత్త దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించిన సినిమా ‘కె- ర్యాంప్’. ఈ సినిమాలో యుక్తీ తరేజా హీరోయిన్గా నటించారు. రాజేశ్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా ఈ చిత్రంను నిర్మించారు. నరేశ్, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2025 దీపావళి సందర్భంగా ఈ నెల 18న కె- ర్యాంప్ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గురువారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వీఐ […]
ఎలక్ట్రీషియన్‌తో కలిసి ఓ ఇంటి యజమాని మాస్టర్ ప్లాన్ వేశాడు. అద్దె ఇంట్లోని బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేశారు. బల్బు హోల్డర్‌లో సీక్రెట్ కెమెరా గమనించిన అద్దెకుంటున్న దంపతులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అద్దెదారులిచ్చిన ఫిర్యాదుతో పోలీసులు యజమానిని అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న ఎలక్ట్రీషియన్ మాత్రం పరారీలో ఉన్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరం మధురానగర్‌లో చోటుచేసుకుంది. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం… జవహర్‌నగర్‌లోని అశోక్ నివాసంలో ఓ జంట అద్దెకుంటున్నారు. ఇటీవల బాత్రూమ్లో […]
ఇండియా, శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా అజేయంగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌లలో ఆసీస్ గెలిచింది. వరుస విజయాలతో సెమీస్‌లో దూసుకెళ్లింది. సెమీస్‌లో అడుగుపెట్టిన మొదటి జట్టుగా కూడా ఆసీస్ నిలిచింది. మెగా టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్.. నాలుగింట్లో గెలవగా, ఒక మ్యాచ్ రద్దయింది. నాలుగు కంటే ఎక్కువ జట్లు 9 పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో.. ఆస్ట్రేలియాకు సెమీస్ బెర్తు ఖరారయింది. Also Read: 77th […]