ఇండియా, శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా అజేయంగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌లలో ఆసీస్ గెలిచింది. వరుస విజయాలతో సెమీస్‌లో దూసుకెళ్లింది. సెమీస్‌లో అడుగుపెట్టిన మొదటి జట్టుగా కూడా ఆసీస్ నిలిచింది. మెగా టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్.. నాలుగింట్లో గెలవగా, ఒక మ్యాచ్ రద్దయింది. నాలుగు కంటే ఎక్కువ జట్లు 9 పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో.. ఆస్ట్రేలియాకు సెమీస్ బెర్తు ఖరారయింది. Also Read: 77th […]
సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 77వ బ్యాచ్ ఐపీఎస్‌లకు శిక్షణ పూర్తయింది. శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు పూర్తయింది. పాసింగ్ అవుట్ పరేడ్‌కు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్‌సింగ్ చౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాసింగ్ అవుట్ పరేడ్‌కు ఐపీఎస్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. బెస్ట్ అర్చివర్స్, ప్రతిభ కనబరిచిన ట్రైనీ ఐపీఎస్‌లకు అవార్డులు, రివార్డులు అందించారు. పరేడ్ కమాండర్‌గా శిక్షణ ఐపీఎస్ అంజిత్ ఏ నాయర్ వ్యవహరించారు. […]
టీమిండియా సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళాడు. సుమారు 7 నెలలు తర్వాత బరిలోకి దిగడంతో ఫ్యాన్స్ అందరు కింగ్ ఆట కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు చేరుకున్న కొన్ని గంటల్లోనే కోహ్లీ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో కోహ్లీ చేసిన ఒక మెసేజ్ తన వన్డే భవిష్యత్తుపై తీవ్ర చర్చకు దారి తీసింది. […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ చరిత్ర సృష్టించారు. బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు 2025లో ప్రసంగించిన తొలి భారతీయ మహిళా నటిగా నిలిచారు. ‘మహిళల ఆరోగ్యం- ప్రపంచ సంపద’ అనే అంశంపై కృతి మాట్లాడారు. ప్రభుత్వాలు, ప్రపంచ సంస్థలు మహిళల ఆరోగ్యాన్ని తేలిగ్గా తీసుకోకూడదని.. దీనిని మానవాళి పురోగతి శ్రేయస్సు, భవిష్యత్తుకు మూలస్తంభంగా పరిగణించాలన్నారు. ప్రపంచ జనాభాలో దాదాపుగా సగం మంది మహిళలే ఉన్నారని, వారి వైద్యానికి సరిపడా నిధులు లేవని కృతి అన్నారు. హీరోయిన్ […]
కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని కలిసిరానున్నాయి. కుటుంబంలో అనుకూలతలు పొందుతుంటారు. వ్యాపారాలను విస్తరింపచేసే ప్రయత్నాల్లో ఉంటారు. రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలు ఉంటాయి. ఒత్తిడితో ఉన్నటువంటి కార్యక్రమాలను అధిగమిస్తారు. కర్కాటక రాశి వారికి నేడు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు. మీరు చేయాల్సిన పూజ దేవీ గడ్గమాల స్తోత్రంను పారాయణం చేయడం మంచిది. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారికి సంబంధించిన నేటి దిన ఫలాలను మీకు ‘భక్తి టీవీ’ అందిస్తోంది. శ్రీ రాయప్రోలు […]
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’తో యాభై ఏళ్ల చరిత్ర ఉన్న మావోయిస్టు పార్టీ కేడర్ కకావికలం అవుతోంది. భద్రతా దళాల నిరంతర ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఉత్తర బస్తర్ డివిజన్ ఇన్‌ఛార్జి రాజ్ మాన్ లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు ఉరఫ్ అభయ్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట సరెండర్ అయ్యారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అగ్రనేత ఆశన్న అలియాస్ […]
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లండని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని ధర్మాసనం హైకోర్టుకు సూచించింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి తీసుకునే చర్యలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో జరుగనున్నకేబినెట్ భేటీలో […]
సోమాజిగూడ శ్రీనగర్‌లో బూత్ స్థాయి సన్నాహక సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. వీరితో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ రియాజ్, కార్పొరేటర్లు విజయా రెడ్డి, సంగీత, మాజీ ఎంపీ అజారుద్దీన్, ఎన్ఎస్యూఐ సెక్రటరీ కుందన్ యాదవ్, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, స్థానిక సీనియర్ నాయకులు సమావేశంకు హాజరయ్యారు. ఈ సందర్భంగా […]
భారతదేశంలో బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం తులం ధర లక్షా 30 వేలకు చేరుకుంది. రానున్న రోజుల్లో ఇంకా మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే గత పది రోజులుగా వరుసగా పెరిగిన గోల్డ్ రేట్స్.. నేడు స్థిరంగా ఉన్నాయి. ఇది పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. బులియన్ మార్కెట్లో ఈరోజు 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.12,944గా.. 1 గ్రాము 22 […]
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్లో విషాదం నెలకొంది. రోజుల వ్యవధిలో ఒకే కుటంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య యత్నంకు పాల్పడగా.. ఒకరు అనారోగ్యంతో మృతి చెందారు. కుమారుడి మృతిని తట్టుకోలేని దంపతులు కూతురుకు పురుగుల మందు తాగించి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనతో రాజీవ్ నగర్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. రాజీవ్ నగర్‌కు చెందిన భార్య-భర్తలు బండి చక్రవర్తి, దివ్యకు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. రెండు నెలల క్రితం […]