గాంధీ కుటుంబం దేశంలో శాంతి, సామరస్యతను కాపాడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీని హత్య చేసిన మతతత్వవాదులు బ్రిటీషర్ల కంటే ప్రమాదం అని పేర్కొన్నారు. మూడు తరాలుగా దేశం కోసం గాంధీ కుటుంబం పనిచేస్తోందన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేసే వారిని తిప్పికొట్టాలన్నారు. బీసీ కులగణన చేసి వందేళ్ల సమస్యకు పరిష్కారం చూపించాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. […]
‘మహిళలకు రూ.2500 ఇవ్వండి సీఎం గారు.. అదొక్కటి చేస్తే ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లే’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీనియర్ నేత వి.హనుమంతరావు కోరారు. మహిళలు కూడా అడుగుతున్నారని, జర అదొక్కటి చేయండి అని విజ్ఞప్తి చేశారు. సన్న బియ్యం ఇస్తా అని చెప్పలేదు కానీ ఇస్తున్నామన్నారు. దేశంలో కులగణన చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే అని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం కోట్లడదాం అని వీహెచ్ చెప్పుకొచ్చారు. చార్మినార్ […]
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి ఆసీస్ మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో.. టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోగా.. భారత్ స్కోరు 11.5 ఓవర్లకు 37/3గా ఉంది. క్రీజ్‌లో శ్రేయస్ (6), అక్షర్ పటేల్ (7) ఉన్నారు. అయితే మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ […]
హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుల్లెట్ కలకలం రేపింది. మూసాపేట మెట్రో స్టేషన్లో ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభించింది. మెట్రో స్టేషన్‌లోని సాధారణ స్కానింగ్‌లో బీప్ శబ్దం రావడంతో.. మెట్రో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రయాణికుడి వద్ద బుల్లెట్ ఉండగా.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూకట్పల్లి పోలీసులు ప్రయాణికుడిని స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు. Also Read: Protest: కస్టమర్లు రావడం లేదని.. సెలూన్ షాప్ యజమాని వినూత్న నిరసన! బిహార్‌కు చెందిన […]
వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో ఓ సెలూన్ షాప్ యజమాని విన్నుతన నిరసన చేపట్టాడు. రోడ్డు పనుల వల్ల తనకు వ్యాపారం జరగడం లేదంటూ.. రోడ్డు మధ్యన నీటిలో కుర్చీ వేసుకొని కూర్చుని నిరసన తెలిపాడు. రోడ్డు మధ్యలో కూర్చోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్డు మధ్య నుంచి లేవాలని స్థానికులు, అధికారులు ఆడినా అతడు ససేమిరా అన్నాడు. రోడ్డు పనుల వల్ల తనకు తీవ్ర నష్టం జరుగుతోందని, తనకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన […]
‘దీపావళి’ పండుగకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. దీపాల పండుగ కోసం దేశంలోని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 2025 దీపావళి పండగ తేదీ విషయంలో జనాలు కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నారు. కొంతమంది జ్యోతిష్కులు పండగ అక్టోబర్ 20న వస్తుందని చెబుతుండగా.. మరికొందరు అక్టోబర్ 21న అని అంటున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి పండగను ఏ రోజున జరుపుకోవాలో తెలుసుకుందాం. దేశంలోని ప్రముఖ పండితుల సంస్థ ‘కాశీ విద్వత్ పరిషత్’.. దీపావళి పండగను అక్టోబర్ […]
టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మలు చివరగా భారత జెర్సీల్లో కనిపించి 223 రోజులైంది. ఇద్దరు దిగ్గజాలు గత మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో ఆడారు. సుదీర్ఘ విరామం తర్వాత రో-కోలను అంతర్జాతీయ క్రికెట్లో చూడబోతున్నామని ఫాన్స్ సంతోషపడ్డారు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. మూడు వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో రోహిత్-కోహ్లీలు పూర్తిగా నిరాశపర్చారు. రోహిత్ శర్మ 8 పరుగులకే ఔట్ అయ్యాడు. జోష్ […]
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ‘హైడ్రా’ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్జోన్లు ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చేస్తోంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా వందల కట్టడాలను నేలమట్టం చేసిన హైడ్రా.. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడింది. నిత్యం విధులతో బిజీగా ఉండే హైడ్రా సిబ్బంది తాజాగా క్రికెట్ ఆడి సేదతీరారు. Also Read: Diwali 2025: దీపావళికి స్వీట్స్ […]
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 95 స్వీట్ షాప్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2025 దీపావళి సందర్భంగా స్వీట్ షాప్‌లపై రైడ్స్ చేపట్టారు. అధికారులు 157 శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ల్యాబ్‌కి పంపారు. 60 కిలోల స్వీట్స్, 40 కిలోల బ్రెడ్ సీజ్ చేశారు. సింథటిక్ కలర్ ఉపయోగిస్తున్న స్వీట్లను అధికారులు సీజ్ చేశారు. నిబంధనలు పాటించని స్వీట్ షాప్‌లకు నోటీసులు ఇచ్చారు. ఎక్స్ పైర్ అయిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్లు గుర్తింపు కొన్ని […]
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం పెర్త్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. చివరగా మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడిన టీమిండియా.. ఏడు నెలల తర్వాత మళ్లీ వన్డే మ్యాచ్ ఆడబోతోంది. వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు తొలి పరీక్ష ఎదురుకానుంది. ఇక కళ్లన్నీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మీదే ఉన్నాయి. కంగారూ గడ్డపై ఈ […]