నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో సంచలనాలు సృష్టిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదలై హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
Also Read: Akhanda 2: మేము చేసిన క్లైమేట్లో ఎవరూ షూట్ చేయలేరు..ఆ భగవంతుడే పక్కనుండి నడిపించాడు!
సినిమా షెడ్యూల్ మరియు వాయిదా గురించి బోయపాటి ఆసక్తికర విషయాలు చెప్పారు. “నేను 135 రోజుల్లో సినిమా తీశాను. కొబ్బరికాయ కొట్టిన రోజే డేట్ అనౌన్స్ చేస్తామని బాలకృష్ణ గారికి ముందే చెప్పాను. మేము అనుకున్నట్టు సెప్టెంబర్ 25 సినిమా రిలీజ్ అన్నాం. మేము అనుకున్నట్టే కాపీ రెడీ అయిపోయింది.” “అదే సమయానికి ‘ఓజీ’ సినిమా ఉంది.
Also Read:Boyapati Srinu : నన్ను చూసి అందరూ లేచి చేతులెత్తి దండం పెట్టారు!
ఇండస్ట్రీలో రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రావడం అంత కరెక్ట్ కాదు. రెండు సినిమాలు బాగుండొచ్చు, కానీ థియేటర్స్ షేర్ అయిపోతాయి. మన రెవిన్యూని మనమే ఇబ్బంది పెట్టుకున్నట్టుగా ఉంటుంది. అప్పుడు బాలయ్య గారు ‘తమ్ముడికి దారి ఇచ్చేద్దాం, మనం తర్వాత వద్దామన్నారు’. అలా మేము పక్కకు వచ్చాము.” ఒక పెద్ద హీరో అయ్యుండి కూడా, మరో సినిమాకు అవకాశం కల్పిస్తూ తన సినిమా విడుదల తేదీని మార్చుకోవడం బాలకృష్ణ గొప్ప మనసుకు నిదర్శనమని బోయపాటి ఈ సందర్భంగా తెలిపారు.