Sampath Kumar
Author- NTV Telugu-
Rajat Patidar RCB: మూడేళ్ల ముందు అమ్ముడే పోలేదు.. ఇప్పుడు ఏకంగా కెప్టెన్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత ఆకర్షణీయ జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు కెప్టెన్‌గా రజత్ పటీదార్ ఎంపికైన విషయం తెలిసిందే. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు నడిపించిన ఆర్సీబీకి.. పెద్దగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని రజత్ సారథిగా నియమితుడు కావడం అందిరినీ ఆశ్చర్యం కలిగించే విషయమే. అంతేకాదు మూడేళ్ల ముందు ఐపీఎల్లో అమ్ముడే కాని ఈ 31 ఏళ్ల ఆటగాడు.. ఆర్సీబీకి […] -
MLC Kavitha: జనగామ జిల్లా ఏర్పడింది కేసీఆర్ కృషితోనే.. బీసీ బిల్లుల కోసం ఉద్యమం చేయాలి!
జనగామ జిల్లా ఏర్పడిందంటే అది మాజీ సీఎం కేసీఆర్ కృషితోనే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉమ్మడి పాలనలో జనగామ ప్రాంతం అన్యాయానికి గురైందని, ప్రత్యేక జిల్లా ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాతే జిల్లా ఏర్పడడం కాకుండా.. జిల్లా అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. బీసీ ఉద్యమాలు చేసి.. బీసీలకు న్యాయం చేసే లాగా కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ప్రయత్నం చేసిందన్నారు. ప్రభుత్వం బిల్లులు సక్రమంగా పెట్టి బీసీ […] -
Rangareddy: రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉద్రిక్తత.. న్యాయమూర్తిపై చెప్పు విసిరిన ముద్దాయి!
రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉద్రిక్తత నెలకొంది. జీవిత ఖైదు పడిన ఓ నేరస్తుడు న్యాయమూర్తి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. రంగారెడ్డి ఫోక్స్ కోర్టు న్యాయమూర్తిపై ముద్దాయి చెప్పు విసిరాడు. ఫోక్సో కేసులో ముద్దాయిగా ప్రకటించడంతో జిర్ణించుకోలేకపోయిన నిందితుడు.. న్యాయమూర్తిపై ఒక్కసారిగా చెప్పు విసిరాడు. కోర్టులో ఉన్న న్యాయవాదులు నేరస్తుడిని పట్టుకుని చితకబాది.. పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో కోర్టులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
Farm House Case: కోడిపందేల నిర్వహణ కేసు.. ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు!
హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ మండలం తొల్కట్ట ఫామ్‌హౌస్‌లో క్యాసినో, కోడిపందేల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కోడిపందేలు జరిగిన ల్యాండ్ శ్రీనివాస్‌కి చెందినదిగా నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని శ్రీనివాస్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేసిన పోలీసులు.. కోడిపందేల నిర్వహణపై సమగ్ర వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. తోల్కట్ట గ్రామం సర్వే నెంబర్ 165/aపై నాలుగు రోజుల్లో ఆధారాలతో తమ ముందు హాజరుకావాలని పోలీసులు ఆయనకు […] -
Microsoft: హైదరాబాద్ జర్నీలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలురాయి: సీఎం
హైదరాబాద్ జర్నీలో ‘మైక్రోసాఫ్ట్’ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలురాయి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే అని, మైక్రోసాఫ్ట్ కృషితో 500 పాఠశాలల్లో కృత్రిమ మేధ (ఏఐ) బోధన ప్రవేశపెడతాం అని సీఎం చెప్పారు. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్షిప్ టీమ్‌కు సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. మైక్రోసాఫ్ట్ నూతన […] -
Bandi Sanjay Kumar: బీసీ జాబితాలో ముస్లింలను చేరిస్తే ఆమోదించే ప్రసక్తే లేదు!
బీసీ జాబితాలో ముస్లింలను చేర్పిస్తే ఆమోదించే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం అని పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ది కాంగ్రెస్ పార్టీకి లేదని తేటతెల్లమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరింత అన్యాయం చేస్తోందని, ముస్లింలను బీసీల్లో కలిపితే హిందూ సమాజమంతా తిరగబడటం ఖాయమన్నారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ది ఉంటే బీసీ జాబితాలో నుండి ముస్లింలను తొలగించాల్సిందే అని, ఎన్నికల హామీ మేరకు […] -
RCB Captain: ఆర్సీబీకి కొత్త కెప్టెన్.. అస్సలు ఊహించలేరు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. యువ బ్యాటర్ రజత్ పటీదార్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ ఆర్సీబీ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. రజత్ పాటిదార్, కృనాల్ పాండ్యాలు ఆర్సీబీ కెప్టెన్ రేసులో ఉన్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. గత సీజన్లో జట్టుకు సారథ్యం వహించిన దక్షిణాఫ్రికా […] -
Chilkur Balaji Temple Priest: అర్చకులు రంగరాజన్‌పై దాడి కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు!
చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధానార్చకులు సీఎస్ రంగరాజన్‌పై దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డి సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిజామాబాద్‌కి చెందిన నాగనపల్లి సాయన్న, ఖమ్మంకి చెందిన భూక్యా గోపాల్ రావు, భూక్యా శ్రీను, అంకోలు శిరీష, బేబి రాణిలు అరెస్ట్ అయ్యారు. ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డిపై అబిడ్స్, బంజారాహిల్స్, గోల్కొండ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నిందితుల రిమాండ్ రిపోర్టులో […] -
KTR: పేద రైతుకు ఒక న్యాయం.. పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా?
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో గేదెల కోసం తీసుకున్న లోన్ కట్టలేదని డీసీసీబీ బ్యాంక్ అధికారులు ఇంటి గేటు పీక్కెళ్లిన విషయం తెలిసిందే. లోన్ చెల్లించలేదని రైతు ఇంటి గేటును ట్రాక్టర్ తీసుకొచ్చి మరి బ్యాంక్ అధికారులు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణం కట్టలేదని ఇంత […] -
Ponnam Prabhakar: రీసర్వే కాదు.. ఇది మిస్ అయిన వారి కోసం మాత్రమే!
రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా సర్వే చేశాం అని, మిస్ అయిన వారి కోసం మరో అవకాశం ఇస్తున్నాం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇది రీసర్వే కాదని, ఇది మిస్ అయిన వారికోసం మాత్రమే అని స్పష్టం చేశారు. సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్ వారికి సర్వే గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. రాజకీయ విమర్శల కొసమే బీసీ ముస్లింల మీద బీజేపీ వారు విమర్శలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్లోని మూడు పదవులలో […]
తాజావార్తలు
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
-
Dil Raju: రాకింగ్ స్టార్ యశ్‌తో దిల్ రాజు సినిమా కన్ఫర్మ్.. కానీ!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!