జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
- కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2026 టైటిల్..
- ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.
- ఫైనల్లో జమైకా కింగ్స్‌మెన్‌పై ఫాల్కన్స్ 8 వికెట్ల తేడాతో విజయం...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPL 2026: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ (Antigua and Barbuda Falcons) తొలిసారి టైటిల్‌ను గెలిచింది. తమ మూడో సీజన్లోనే ఫాల్కన్స్ ఈ ఘనత సాధించింది. ఆదివారం బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన ఫైనల్లో టోర్నీలో జమైకా కింగ్స్‌మెన్ (Jamaica Kingsmen) పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ తర్వాత ముందుగా బ్యాటింగ్ చేసిన జమైకా కింగ్స్‌మెన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. మాజ్ సదాఖత్ 58 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్ల సహాయంతో 114 పరుగులతో అదరహో అనిపించాడు. కింగ్స్‌మెన్ జట్టు సాధించిన మొత్తం స్కోర్‌లో సగానికి పైగా పరుగులు సదాఖత్ ఒక్కడే చేశాడు. అయితే మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. సైమ్ అయూబ్ 29 పరుగులతో రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. టాప్-6లో ముగ్గురు బ్యాటర్లు డకౌట్ ఇక్కడ మరో విడ్డురం.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
- CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
ఆరంభంలోనే కింగ్స్మెన్కు ఎదురుదెబ్బ తగిలింది. జేడెన్ సీల్స్ తొలి ఓవర్లోనే కిర్క్ మెకెంజీని 4 బంతుల్లో డకౌట్ చేశాడు. నాలుగో ఓవర్లో కీసీ కార్టీ 9 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో 30 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన జట్టును సదాఖత్, సైమ్ అయూబ్ ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో కింగ్స్‌మెన్ 110/2కు చేరుకుంది. సదాఖత్ దూకుడైన బ్యాటింగ్‌తో స్కోరు వేగంగా పెరిగింది.
110 పరుగుల వద్ద కింగ్స్‌మెన్ భారీ స్కోరు చేసేలా కనిపించిన సమయంలో సుఫ్యాన్ మొకీమ్ మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. 12వ ఓవర్లో సైమ్ అయూబ్‌ను ఔట్ చేసిన మొకీమ్ అదే ఓవర్లో రోవ్‌మన్ పావెల్‌ను కూడా పెవిలియన్‌కు పంపించాడు. దీంతో కేవలం మూడు ఓవర్ల వ్యవధిలో కింగ్స్‌మెన్ 110/2 నుంచి 113/6కు పడిపోయింది. సదాఖత్ మాత్రం మరో ఎండ్‌లో దూకుడుగా ఆడుతూ చివరి వరకు పోరాడాడు. ఇన్నింగ్స్ 20వ ఓవర్లో చివరి రెండు బంతుల్లో ఒకటికి ఔటయ్యాడు. చివరికి కింగ్స్‌మెన్ 170/9 స్కోరుకే పరిమితమైంది. ఫాల్కన్స్ తరఫున సుఫ్యాన్ మొకీమ్ 4 వికెట్లు పడగొట్టాడు.
171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఫాల్కన్స్‌కు రహ్కీమ్ కార్న్‌వాల్ అదిరిపోయే ఆరంభం అందించాడు. సైమ్ అయూబ్ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 20 పరుగులు రాబట్టాడు. అయితే అదే ఓవర్ చివరి బంతికి బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఎవిన్ లూయిస్, అమీర్ జంగూ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. రెండో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లూయిస్ 38 పరుగుల వద్ద ఔటయ్యే సమయానికి ఫాల్కన్స్ లక్ష్యంలో దాదాపు సగం పరుగులు పూర్తి చేసింది.
ఆ తర్వాత అమీర్ జంగూ, హసన్ నవాజ్ కలిసి కింగ్స్మెన్కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఇద్దరూ కలిసి అజేయంగా 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో జంగూ 57 పరుగులతో, నవాజ్ 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. చివర్లో 17వ ఓవర్లో నవాజ్ వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో ఫాల్కన్స్ మరో 20 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. దీనితో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ మొదటిసారి కప్ ను ముద్దాడింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!