Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Lathi-Charge YCP Leaders at Vijayawada SAAP Office: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న వివాదం.. సోమవారం విజయవాడలో మరింత ఉద్రిక్తతకు దారితీసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కార్యాలయం వద్ద వైసీపీ నేతలు, శ్రేణులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ.. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ శాప్ కార్యాలయం వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు శాప్ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు మూడంచెల బారికేడ్లను ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. బారికేడ్లను దాటుకుని శాప్ కార్యాలయం వైపు వెళ్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. జోగి రమేష్, దేవినేని అవినాష్, మేరుగ నాగార్జున తదితర నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వైసీపీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
Also Read
ఇదే సమయంలో శాప్ కార్యాలయం నుంచి కొందరు టీడీపీ శ్రేణులు బయటకు రావడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ ఘటనలో కొందరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. వైసీపీ నిరసన నేపథ్యంలో బందరు రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శాప్ కార్యాలయం పరిసరాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులు బారికేడ్లను దాటి ముందుకు వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. నిరసనకు అనుమతి లేదని పోలీసులు ముందుగానే స్పష్టం చేశారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా నకిలీ లేదా అనుమానాస్పద క్రీడా ధ్రువపత్రాల ద్వారా కొందరికి ఉద్యోగాలు దక్కాయని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు, సీబీఐ విచారణ కోరుతున్నారు. అయితే స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన ఉపాధ్యాయులు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. తమ అర్హతలు, క్రీడా ప్రతిభ, ధ్రువపత్రాల ఆధారంగానే నియామకాలు జరిగాయని వారు చెబుతున్నారు. మరోవైపు ఏపీ అధికారులు కూడా అభ్యర్థుల అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లను నిబంధనల ప్రకారం పరిశీలిస్తున్నామని, నకిలీ సర్టిఫికెట్ తేలితే తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తాజావార్తలు
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!