Varra Ravindra Reddy: వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్!
- వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
- జైల్లో చికిత్స అందించాలని మెజిస్ట్రేట్ ఆదేశం
- జగ్గయ్యపేట సబ్ జైలుకు వర్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి వర్రా రవీందర్ రెడ్డికి జగ్గయ్యపేట కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మెడ నొప్పి, నడుముల నెప్పి వల్లన కడప సెంట్రల్ జైలుకు పంపించాలని వర్రా కోరారు. అయితే జగ్గయ్యపేట సబ్ జైల్లో అవసరమైన ఏర్పాట్లు, చికిత్స అందించాలని పోలీసులకు మెజిస్ట్రేట్ తెలిపింది. మెజిస్ట్రేట్ ఆదేశాలకే జగ్గయ్యపేట సబ్ జైల్ అధికారులు ఓకే చెప్పారు. అనంతరం జగ్గయ్యపేట సబ్ జైలుకు వర్రా రవీందర్ రెడ్డిని తరలించారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వర్రాని.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పోలీసులు పీటీ వారెంట్‌పై మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డి.. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో వర్రాపై పలు కేసులు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా షేర్ మహమ్మద్ పేటకు చెందిన ఎనికే గోపి ఫిర్యాదు మేరకు చిల్లకల్లు పోలీసులు వర్రాపై ఐటీ యాక్ట్ ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. చిల్లకల్లు పోలీసులు కడప జైలుకు వెళ్లి వర్రాను అదుపులోకి తీసుకున్నారు. కడప జైలు అధికారులు వర్రాకు వైద్య పరీక్షలు చేయించి.. జగ్గయ్యపేట పోలీసులకు అప్పగించారు. బుధవారం జగ్గయ్యపేట కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.
Also Read
తాజావార్తలు
-
LPG Booking: ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఊరట.. బుకింగ్ సమయంపై కేంద్రం కీలక ప్రకటన
-
ChatGPT వాడుతున్నారా? ఇకపై మీకు ఒక కొత్త తలనొప్పి రాబోతుంది!
-
The Paradise: వాయిదా లేదు.. చెప్పిన డేటుకే నాని సినిమా
-
Trump Hair: హెయిర్‌స్టైల్ మార్చేసిన ట్రంప్.. నెటిజన్లు కామెంట్లు
-
Python in Car: కారులో 7 అడుగుల కొండచిలువ.. బోనెట్ తెరవగానే షాక్..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!